ChatGPT Pro : అత్యాధునిక ఏఐ ఫీచర్స్‌తో చాట్‌జీపీటీ ‘ప్రో’- అన్లిమిటెడ్ యాక్సెస్ కావాలా?
09 December 2024, 10:10 IST
చాట్‌జీపీటీ ప్రో వర్షెన్‌ని ఇటీవలే ఇండియాలోకి తీసుకొచ్చింది ఓపెన్ఏఐ. కానీ ఇది కాస్త ఖరీదైన వ్యవహారమే! సబ్స్క్రిప్షన్ మోడల్ యిన చాట్‌జీపీని ప్రోని యాక్సెస్ చేసుకావాలంటే రూ. నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
అత్యాధునిక ఏఐ ఫీచర్స్‌తో చాట్‌జీపీటీ ‘ప్రో’
నేటి టెక్ యుగాన్ని చాట్‌జీపీటీ ఎలా ఏలుతోందో మనందరికి తెలిసిందే. 2022లో తొలిసారి ప్రపంచానికి పరిచయమైన ఈ ఏఐ టూల్.. ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. చాట్‌జీపీటీ ఉచితమే అయినా, ఆ తర్వాత ఇండియాలో రూ. 1999 ధరకు చాట్‌జీపీటీ ప్లస్‌ని లాంచ్ చేసింది సంస్థ. ఇక ఇప్పుడు కంపెనీ తన అడుగు ముందుకేసి చాట్‌జీపీటీ ప్రోని ప్రవేశపెట్టింది. విషయం ఏంటంటే, దీనిని ఫ్రీగా యాక్సెస్ చేయలేరు! ఇది చాలా ఖరీదైనదే అని చెప్పుకోవాలి. నెలకు 200 డాలర్లు అంటే దాదాపు రూ.17,000 చెల్లించి ఈ ప్రో వర్షెన్‌ని వాడుకోవాల్సి ఉంటుంది. ధరకు తగ్గట్టుగానే ఇందులో అనేక కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
చాట్‌జీపీటీ 'ప్రో'లో కొత్తగా ఏముంది?
ఈ 200 డాలర్ల నెలవారీ సబ్స్క్రిప్షన్ ద్వారా జీపీటీ-4ఓతో పాటు అత్యంత అధునాతన ఏఐ మోడల్ ఓపెన్ఏఐ ఓ1కు అపరిమిత యాక్సెస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రో సబ్‌స్క్రిప్షన్‌లో అడ్వాన్స్డ్ వాయిస్ ఫీచర్లు, ఓ1 ప్రో మోడ్‌కు యాక్సెస్ కూడా ఉన్నాయి. ఇది వినియోగదారులకు అధిక కంప్యూటేషనల్ పవర్‌ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది.
ఈ పెరిగిన గణన సామర్థ్యం నమూనా ఇంకా మెరుగ్గా ఆలోచించగలదని, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అందించగలదని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో, ప్రో వర్షెన్‌లో మరింత శక్తివంతమైన కంప్యూటింగ్ వనరులు, ఉత్పాదకత-కేంద్రీకృత అంశాలను కలిగి ఉంటుందని ఓపెన్ఎఐ పేర్కొంది.
రోజువారీ ఉత్పాదకతను పెంచడానికి రీసెర్చ్-గ్రేడ్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే పరిశోధకులు, ఇంజనీర్లు, నిపుణుల కోసం ఓపెన్ఎఐ చాట్‌జీపీటీ ప్రోను ఒక సాధనంగా తీసుకొచ్చింది.
చాట్‌జీపీటీ ప్రోని.. ఇతర వర్షెన్‌తో పోల్చితే!
ఓపెన్ఏఐ ప్రకారం.. ఇప్పటివరకు ఉన్న వాటిల్లో అత్యంత ఇంటెలిజెంట్ మోడల్ ఈ చాట్‌జీపీటీ ప్రో. సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్స్‌కి అపరిమిత యాక్సెస్ అందిస్తుంది. అత్యంత నమ్మదగిన రెస్పాన్స్‌లను అందిస్తుంది. ముఖ్యంగా డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, కేస్ లా అనాలసిస్ వంటి ప్రత్యేక విభాగాల్లో కచ్చితమైన, సమగ్రమైన రెస్పాన్సెస్ని జనరేట్ చేయడానికి ఓ1 ప్రో మోడ్ ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్, కోడింగ్ సహా పలు సబ్జెక్టుల్లో మెషిన్ లెర్నింగ్ బెంచ్ మార్క్‌లలో ఓ1 ప్రో మోడ్ మెరుగైన పనితీరును కనబరిచిందని కంపెనీ పేర్కొంది.
చాట్ జీపీటీ ప్రో సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్లు మోడల్ సెలెక్టర్ ద్వారా ఓ1 ప్రో మోడ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదేమైనా, ఇది కంప్యూట్-ఇంటెన్సివ్ మోడల్ కాబట్టి ప్రతిస్పందనలు ఎక్కువ సమయం పట్టవచ్చని గుర్తుపెట్టుకోవాలి. మోడల్ సమాధానాన్ని జనరేట్ చేసేటప్పుడు వినియోగదారులు రెస్పాన్స్ ఇండికేటర్‌ని చూసి ఇంకెంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.