ChatGPT : ఇండియాలో చాట్ జీపీటీకి సూపర్ క్రేజ్.. యాప్ స్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్ ఇదే!
27 May 2023, 8:04 IST
- ChatGPT App store : ఇండియాలో చాట్ జీపీటీకి సూపర్ క్రేజ్ లభిస్తోంది! యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ఈ చాట్ జీపీటీ టాప్ ఫ్రీ యాప్‌గా నిలిచింది!
ఇండియాలో చాట్ జీపీటీకి సూపర్ క్రేజ్..
ChatGPT App store : ఇప్పుడు ప్రపంచమంతా చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటోంది. ఇండియాలో ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంది! ఐఫోన్, ఐప్యాడ్‌కు చెందిన యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్స్ లిస్ట్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను వెనక్కి నెట్టి మరీ, తక్కువ కాలంలో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది.
ఇండియాలో చాట్ జీపీటీ ఐఓఎస్ యాప్ ఫ్రీగా లభిస్తుండటం అతిపెద్ద హైలైట్. పైగా.. ఇందులో ఎలాంటి యాడ్స్ కూడా ఉండటం లేదు. ఇందులో 'విస్పర్ ఇంటిగ్రేషన్' వెసులుబాటు ఉండటంతో.. వాయిస్ ఇన్పుట్స్ కూడా సులభంగా ప్రాసెస్ అయిపోతుంది. మీ డివైజ్‌లలోని వెబ్ వర్షెన్కు చెందిన హిస్టరీని ఇది సింక్ చేస్తుంది. ఫలితంగా మీరు ఏ డివైజ్ వాడినా, సెర్చ్ హిస్టరీని యాక్సెస్ చేసుకోవచ్చు.
చాట్ జీపీటీ- ఐఓఎస్ యాప్..
ఐఓఎస్‌లో చాట్ జీపీటీని వినియోగిస్తే క్షణాల్లోనే మీకు సమాధానాలు వచ్చేస్తాయి. అయితే.. ఇందులో రియల్ టైమ్ డేటా ఉండదని గుర్తుపెట్టుకోవాలి.
ఈ చాట్ జీపీటీ ఫ్రీ యాప్‌తో మీరు వ్యాసాలు రాయవచ్చి. అదే సమయంలో పెద్ద పెద్ద వ్యాసాల సమ్మరీని పొందవచ్చు. ఇక ఉద్యోగాల్లో సెలవులకు అప్లై చేసుకోవచ్చు. కొత్త కొత్త భాషలు నేర్చుకోవచ్చు. క్రియేటివ్ ఐడియాలు పొందవచ్చు.
ChatGPT: ప్రపంచమంతా ‘చాట్ జీపీటీ’పైనే చర్చ.. అసలు ఏంటీ టూల్.. ఉపయోగాలేంటి.. ఆందోళన ఎందుకు?
చాట్ జీపీటీ ఐఓఎస్ యాప్‌ను అలా డౌన్లోడ్ చేసుకోండి..
యాప్ స్టోర్‌లో ChatGPT అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో యాప్స్ మీకు దర్శనమిస్తాయి. అయితే ఈ యాప్ సైజు 16.1ఎంబీ. దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 16.1 లేదా అంత కన్నా లేటెస్ట్ వర్షెన్లతో పని చేసే ఐఫోన్, ఐప్యాడ్లలో దీనిని ఉపయోగించుకోవచ్చు.
చాట్ జీపీటీ ప్లస్‌ను వినియోగించుకోవాలంటే.. నెలకు రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది.
ChatGPT in India : ఇక యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. యాపిల్/ గూగుల్ ఐడీతో అకౌంట్ తయారు చేసుకోవాలి. వెబ్ నుంచి మీకు ముందే అకౌంట్ ఉంటే.. సంబంధిత ఐడీతో లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఇన్-యాప్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మీకు చాట్ జీపీటీకి యాక్సెస్ లభిస్తుంది.
ఈ దేశాల్లో అందుబాటులోకి చాట్ జీపీటీ..
చాట్ జీపీటీ ఐఓఎస్ యాప్ ఇప్పటికే ఇండియాతో పాటు ఇరాక్, అల్గేరియా, బొలీవియా, బ్రెజిల్, అర్జెంటీనా, అజర్బైజాన్, కెనడా, చిలీ, లెబనాన్, మారీషియస్, కోస్టారికా, ఈక్వెడార్, గానా, ఇజ్రాయెల్, పెరు, జపాన్, స్లోవీనియా, తునీషియా, పోలాండ్, ఖజఖిస్తాన్, జార్డన్, మెక్సికో, కువైట్, నమీబియా, మొరాకో, ఓమన్, పాకిస్థాన్, ఖతార్, యూఏఈ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.