తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt Stock Prices: చాట్ జీపీటీతో షేర్ల ధరలు పెరుగుతాయో, లేదో తెలుసుకోవచ్చు

ChatGPT stock prices: చాట్ జీపీటీతో షేర్ల ధరలు పెరుగుతాయో, లేదో తెలుసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

13 April 2023, 16:57 IST

google News
  • ChatGPT predicts stock prices: కృత్రిమ మేథ తో రూపొందిన చాట్ జీపీటీ (ChatGPT) భవిష్యత్తులో ఎన్నో రంగాల్లో ఉద్యోగులకు చెక్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ చాట్ జీపీటీతో షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులను కూడా తెలుసుకోవచ్చని ఇటీవల తేలింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bajaj Finserv)

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT predicts stock prices: యూనివర్సిటీలోని ఫ్లారిడా (University of Florida) లో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అలెజాండ్రో లోపెజ్ (professor Alejandro Lopez-Lira) చాట్ జీపీటీపై పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా చాట్ జీపీటీ (ChatGPT) తో రోజువారీగా వివిధ కంపెనీల షేర్ల ధరల్లో చోటు చేసుకునే మార్పులను తెలుసుకోవచ్చా? అనే కోణంలో ఆయన టీమ్ పరిశోధనలు చేసింది. చాట్ జీపీటీ చాట్ బాట్ (ChatGPT chatbot) ను సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ (Open AI) సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే.

ChatGPT predicts stock prices: న్యూస్ హెడ్ లైన్స్ చెప్పి..

ఈ పరిశోధనల్లో భాగంగా.. ప్రతీరోజు ఆ రోజు వార్తల్లోని ముఖ్యాంశాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్ల విలువలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో వివరించాలని చాట్ జీపీటీ (ChatGPT) ని వారు కోరారు. ఆయా వార్తలు ఆ కంపెనీల షేర్ల విలువను పెంచుతాయా? లేక తగ్గిస్తాయా? చెప్పాలని అడిగారు. ఆశ్చర్యకరంగా, చాట్ జీపీటీ (ChatGPT) అంచనాలు వాస్తవంగా ఆ రోజు ఆయా కంపెనీల షేర్ల విలువలో చోటు చేసుకున్న మార్పులకు సరిపోలాయని తేలింది.

ChatGPT predicts stock prices: దాదాపు సరిగ్గా అంచనా

రాజకీయ, ఆర్థిక, వాణిజ్య సంబంధ వార్తలను అర్థం చేసుకుని, వాటిని క్రోడీకరించి, ఆయా వార్తల ప్రభావం నిర్దిష్ట కంపెనీల షేర్ల విలువపై ఎలాంటి ప్రభావం చూపుతాయని చాట్ జీపీటీ (ChatGPT) తెలియజేసిందని అలెజాండ్రో లోపెజ్ వెల్లడించారు. చాట్ జీపీటీ అంచనాలు 97% వాస్తవ ఫలితాలతో సరిపోలాయని తెలిపారు. అయితే, ఈ అంచనాలు ఒక్కో సమయంలో విఫలమయ్యే అవకాశం కూడా ఉందని, చాట్ జీపీటీ (ChatGPT) పరిశీలనకు రాని అంశాల ప్రభావం, అదృశ్య శక్తుల ప్రభావంతో ఈ అంచనాలు తప్పే ప్రమాదముందని హెచ్చరించారు.

ChatGPT predicts stock prices: ఈ ఉద్యోగాలకు డేంజర్

అయితే, చాట్ జీపీటీ (ChatGPT) కారణంగా ఈ ఫైనాన్షియల్ జాబ్స్(financial jobs) కు ముప్పు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ డేటాను, అత్యంత తక్కువ సమయంలో అర్థం చేసుకుని, క్రోడీకరించి, ఫలితాలను ప్రకటించగల కృత్రిమ మేథ వ్యవస్థలు (artificial intelligence models) దెబ్బతీసే ఉద్యోగ రంగాల్లో ఫెనాన్షియల్ సెక్టార్ కూడా ఉందని భావిస్తున్నారు. ఎక్కువ వేతనాలు ఇచ్చి ఈ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వడం కన్నా చాట్ జీపీటీ (ChatGPT) సేవలు పొందడం మంచిదనే భావనకు కంపెనీలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చాట్ జీపీటీ వంటి ఈ కృత్రిమ మేథ వ్యవస్థల (artificial intelligence (AI) models) వల్ల కనీసం 35% ఫైనాన్షియల్ జాబ్స్ (financial jobs) కు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం