ChatGPT - GPT 4: చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ ‘జీపీటీ-4’ వచ్చేసింది: మరింత కచ్చితత్వంతో ఆన్సర్లు!-openai releases gpt 4 know full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chatgpt - Gpt 4: చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ ‘జీపీటీ-4’ వచ్చేసింది: మరింత కచ్చితత్వంతో ఆన్సర్లు!

ChatGPT - GPT 4: చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ ‘జీపీటీ-4’ వచ్చేసింది: మరింత కచ్చితత్వంతో ఆన్సర్లు!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2023 08:36 AM IST

ChatGPT - GPT 4: చాట్ జీపీటీకి లేటెస్ట్ వెర్షన్‍ను ఓపెన్ ఏఐ సంస్థ రిలీజ్ చేసింది. ఇది మరింత కచ్చితత్వంలో వేగంగా సమాధానాలు ఇస్తుందని వెల్లడించింది.

ChatGPT - GPT 4: చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ ‘జీపీటీ-4’ వచ్చేసింది
ChatGPT - GPT 4: చాట్ జీపీటీ లేటెస్ట్ వెర్షన్ ‘జీపీటీ-4’ వచ్చేసింది (AFP)

ChatGPT - GPT 4: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఐ చాట్‍బోట్ చాట్ జీపీటీ(Chat GPT)కి అప్‍డేటెడ్ వెర్షన్ వచ్చేసింది. మరింత శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మోడల్‍ జీపీటీ-4(GPT-4)ను ఓపెన్ ఏఐ రిలీజ్ చేసింది. ప్రస్తుత చాట్‍జీపీటీ-3.5 కన్నా ఇది మరింత వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెబుతుందని ఓపెన్ ఏఐ (Open AI) పేర్కొంది. దాదాపు మనిషి లాంటి టెక్నాలజీ ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ ప్లాన్ చాట్‍జీపీటీ ప్లస్ సబ్‍స్క్రైబర్లకు ఈ జీపీటీ-4 అందుబాటులో ఉంది. వివరాలివే.

మనిషి స్థాయిలో సమాధానాలు..

ChatGPT - GPT 4: నవంబర్‌లో చాట్‍జీపీటీ వచ్చి పాపులర్ అయినప్పటి నుంచి చాలా మంది జీపీటీ-4 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కంటే ఈ జీపీటీ-4 టెక్నాలజీ అత్యుత్తమంగా ఉండనుండటంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. “మేం జీపీటీ-4ను క్రియేట్ చేశాం. డీప్ లెర్నింగ్‍లో మరింత ముందుకు వెళ్లేందుకు ఓపెన్ ఏఐకి ఇది ఓ మైలురాయిగా నిలిచింది” అని ఓపెన్ ఏఐ తన బ్లాగ్‍లో వెల్లడించింది. కొన్ని ప్రొఫెషనల్, అకడమిక్ టాస్కులను ఈ జీపీటీ-4 మనిషి స్థాయిలో చేస్తుందని వెల్లడించింది.

మరింత క్రియేటివ్‍గా..

ChatGPT - GPT 4: జీపీటీ-4 మరింత క్రియేటివ్‍గా ఉంటుందని ఓపెన్ ఏఐ పేర్కొంది. “జీపీటీ-4 మోడల్ ఇంతకు ముందు కంటే మరింత క్రియేటివ్‍గా ఉంటుంది. క్లిష్టతరమైన ప్రశ్నలు, ప్రాబ్లమ్‍లకు చాలా కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుంది” అని ఓపెన్ ఏఐ ప్రకటించింది.

భవిష్యత్తులో ఇమేజ్‍లు కూడా..

ChatGPT - GPT 4: అప్‍డేట్‍తో జీపీటీ-4 టెక్స్చ్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉండనుంది. భవిష్యత్తులో ఇమేజ్‍ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా జీపీటీ-4 ఉండనుంది. ఉదాహణకు, రిఫ్రిజిరేటర్‌ లోపలి భాగాన్ని ఫొటో తీసి జీపీటీ-4లో అప్‍లోడ్ చేస్తే అందులోని వాటిని బట్టి ఏ వంట చేసుకోవచ్చో… ఎలా చేసుకోవచ్చో జీపీటీ-4 చెబుతుంది. ఇలా ఏదైనా ఫొటోలను అప్‍లోడ్ చేస్తే ఇందులోని వాటిని బట్టి వాటికి సంబంధించిన ఔట్‍పుట్ ఇస్తుంది. కాగా, ప్రస్తుతం టెక్ట్స్ రూపంలో ప్రశ్నలు అడితే.. టెక్స్ట్ రూపంలోనే వివరంగా సమాధానాలు ఇస్తోంది ఈ ఏఐ చాట్‍బోట్.

ఓపెన్ ఐఏ పెయిడ్ సబ్‍స్క్రిప్షన్ చాట్‍జీపీటీ ప్లస్ (ChatGPT Plus) ద్వారా జీపీటీ-4 ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ ఉన్న వారు చాట్‍జీపీటీలో ఈ జీపీటీ-4ను యాక్సెస్ చేసుకోవచ్చు.జీపీటీ-4తో కూడిన బింజ్ సెర్చ్ ఇంజిన్‍ను మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది.

టెక్స్ట్ రూపంలో ఏదైనా ప్రశ్న అడిగితే.. చాట్‍జీపీటీ వివరంగా, వేగంగా టెక్ట్స్ రూపంలో సమాధానాలు ఇస్తుంది. అడిగిన ప్రశ్నకు ఓ ఆన్సర్‌ను అందుబాటులో ఉన్న వివరాలన్నింటితో కలిపి ఇస్తుంది. కోడింగ్, మ్యాథమేటిక్స్, హిస్టరీ, రెసిపీలు ఇలా ఒక్కటేంటి ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. దీంతో అత్యంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను ఈ చాట్‍జీపీటీ దక్కించుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్