Cars launch in August 2023 : ఆగస్ట్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న కార్స్ ఇవే..!
30 July 2023, 12:44 IST
- Cars launch in August 2023 : 2023 ఆగస్ట్‌లో పలు కార్స్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఆగస్ట్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న కార్స్ ఇవే..!
Cars launch in August 2023 : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్టర్తో జులై నెలలో ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడిపోయింది. ఇక ఆగస్ట్ నెలలో కూడా అదిరిపోయే మోడల్స్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ సీఎన్జీ..
2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో పంచ్ సీఎన్జీ మోడల్‌ను ప్రదర్శించింది టాటా మోటార్స్. ఇక ఇప్పుడు.. ఈ ఎస్యూవీ ఆగస్ట్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని సమాచారం. ఇందులో 1.2లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ మోడ్‌లో.. ఇది 77 హెచ్‌పీ పవర్‌ను, 97ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. లేటెస్ట్ ఐ-సీఎన్జీ టెక్నాలజీని ఇందులో వాడుతోంది సంస్థ. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ వర్షెన్కు ఇది గట్టిపోటీనిస్తుంది.
ఆడీ క్యూ8 ఈ-ట్రాన్..
ఆగస్ట్‌లో లగ్జరీ వాహనాలు కూడా సందడి చేయనున్నాయి. వీటిల్లో ఆడీ క్యూ8 ఈ-ట్రాన్ ఒకటి. ఇది ఇప్పటికే ఇండియాలో ఆవిష్కృతమైంది. ఆడీ ఈ-ట్రాన్‌కు ఇది ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ ఈవీలో 95కేడబ్ల్యూహెచ్, 114కేడబ్ల్యూ హెచ్ వంటి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. రెండో బ్యాటరీ రేంజ్ 600కి.మీలు. ఈ మోడల్ ఆగస్ట్ 18న లాంచ్కానుంది.
ఇదీ చూడండి:- Kia EV5 electric SUV : ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనున్న కియా!
టయోటా రూమియన్..
చిన్న సైజు ఎంపీవీ అయిన రూమియన్‌ను ఆగస్ట్‌లో ఇండియాలో లాంచ్ చేసేందుకు టయోటా సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని టాక్. ఇది ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 103 హెచ్‌పీ పవర్‌ను, 137 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ వర్షెన్ కూడా ఉంది. కానీ ఇప్పుడే ఇది లాంచ్ అవ్వకపోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సెకెండ్ జెన్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ..
ఈ ఎస్యూవీ.. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది లాంచ్ అయ్యిుంది. ఇక ఇండియాలో ఆగస్ట్ 9న లాంచ్ అవ్వనుంది. జీఎల్సీ 300 పెట్రోల్, జీఎల్సీ 220డీ డీజిల్ మోడల్స్‌లో ఇది అందుబాటులో ఉండనుంది. 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11.9 ఇంచ్ పోట్రైట్ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఉంటాయి.
క్రేటా, అల్కజార్ కొత్త ఎడిషన్స్..!
Cars launch in August : క్రేటా, అల్కజార్ ఎస్‌యూవీలు.. హ్యుందాయ్ మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్నాయి. ఇక ఇప్పుడు.. వీటికి అడ్వెంచర్ ఎడిషన్స్‌ను సంస్థ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. క్రేటా నైట్ ఎడిషన్‌ను ఇది రిప్లేస్ చేస్తుంది. లాంచ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
వోల్వో సీ40 రీఛార్జ్..
ఈ వోల్వో సీ40 రీఛార్జ్ అనేది ఒక ఈవీ. ఇండియాలో వోల్వోకు ఇది రెండో ఈవీగా ఉండనుంది. సెప్టెంబర్‌లో డెలివరీలు మొదలవుతాయి. ఇందులోని 78కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 530కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది.