Electric car maintenance tips: ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నారా? ఈ మెయింటెనెన్స్ టిప్స్ తప్పకుండా ఫాలో కండి..
29 July 2023, 20:27 IST
Electric car:ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కాలం నడుస్తోంది. కాలుష్య రహిత వాహనాలు కావడం వల్ల ప్రభుత్వాలు కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ టిప్స్ ఫాలో కావడం ద్వారా మీ ఎలక్ట్రిక్ కారుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
Electric car maintenance tips: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కాలం నడుస్తోంది. కాలుష్య రహిత వాహనాలు కావడం వల్ల ప్రభుత్వాలు కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ టిప్స్ ఫాలో కావడం ద్వారా మీ ఎలక్ట్రిక్ కారుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
Ensure Battery health: బ్యాటరీని రెగ్యులర్ గా చెక్ చేయించండి..
పెట్రోలు, డీజిల్ వాహనాల మాదిరిగా కాకుండా, ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలపై, ప్రధానంగా లిథియం - అయాన్ (lithium-ion) నడుస్తుంటాయి. బ్యాటరీ హెల్త్ సరిగ్గా లేకపోతే కారుకు సమస్యలు వస్తాయి. అందువల్ల నిపుణులచే క్రమం తప్పకుండా మీ కారు బ్యాటరీని చెక్ చేయించండి.
Timely change of fluids: ఆయిల్స్ ను మారుస్తుండాలి
ఎలక్ట్రిక్ కార్లలోనూ కొన్ని ఆయిల్స్, లూబ్రికంట్స్ అవసరం ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా మారుస్తుండాలి. ఉదాహరణకు బ్రేక్ ఆయిల్ ను రెగ్యులర్ గా మారుస్తుంటేనే బ్రేక్ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది.
Take care of suspension: సస్పెన్షన్ ను గమనిస్తుండండి
పెట్రోలు, డీజిల్ వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ కార్లకు కూడా సస్పెన్షన్ సిస్టమ్ బావుండాలి. రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో నుంచి వెళ్లినప్పుడు, ఓవర్ లోడ్ అయినప్పుడు కారు సస్పెన్షన్స్ దెబ్బతింటాయి. అందువల్ల సస్పెన్షన్స్ ను కూడా రెగ్యులర్ గా చెక్ చేస్తుండాలి. అవసరమైనప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా రిపేర్ చేయిస్తుండాలి.
Periodic rotation of tyres: టైర్లను రొటేట్ చేస్తుండాలి..
చాలా మంది కారు ఓనర్లు నిర్లక్ష్యం చేసే విషయం టైర్ల రొటేషన్. కొంత సమయం గడిచిన తరువాత ముందు టైర్లను వెనక్కు, వెనుక టైర్లను ముందుకు మార్చడం వల్ల టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే, టైర్లు పూర్తిగా అరిగిపోయేవరకు ఆగకుండా, టైర్ మార్చాల్సిన సమయం రాగానే మార్చడం సేఫ్టీ పరంగా చాలా అవసరం.
Periodic replacement of cabin air filter: క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్ పరిశీలిస్తుండాలి
ఎలక్ట్రిక్ కార్లలో క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ ఉంటాయి. వీటి వల్ల ఏసీ వెంట్స్ లో నుంచి గాలి ఫిల్టర్ అయి స్వచ్ఛమైన గాలి కారు క్యాబిన్ లోకి వస్తుంది. ఆ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమయం రాగానే మారుస్తుండాలి.