BMW India : 8 వారాలు- 8 కొత్త లాంచ్‌లు! బీఎండబ్ల్యూ ఇండియా సూపర్ ప్లాన్!
12 December 2022, 6:56 IST
- BMW India : రానున్న 8 వారాల్లో 8 ప్రాడక్ట్‌లను లాంచ్ చేయనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా వెల్లడించింది. ఈ లైనప్‌లో ఐ7 ఎలక్ట్రిక్ కూడా ఉంది.
8 వారాలు- 8 కొత్త లాంచ్‌లు! బీఎండబ్ల్యూ ఇండియా సూపర్ ప్లాన్!
BMW India : 2022.. బీఎండబ్ల్యూ ఇండియాకు కలిసి వచ్చింది! ఈ ఏడాది ఇండియాలో సంస్థ వ్యాపారం జోరందుకుంది. 2023లో కూడా దీనిని కొనసాగించేందుకు ఈ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఇప్పటికే ప్రణాళికలు రచించింది. ఐ7 ఎలక్ట్రిక్ సెడాన్‌తో పాటు.. వచ్చే ఏడాదిలో వివిధ వాహనాలను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రానున్న 8 వారాల్లో 8 ప్రాడక్ట్‌లను లాంచ్ చేయనున్నట్టు చెప్పింది.
2022లో కనిపించిన జోరు.. 2023లో కూడా కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు.. 'కొనసాగుతుందన్న నమ్మకం మాకు ఉంది,' అని బదులిచ్చారు బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్.
BMW India lineup : "దేశీయ వాహనాల మార్కెట్ సానుకూల దశలో ఉంది. 2023లో కూడా ఇది కొనసాగవచ్చు. ఇంత కాలం కలలు కన్న కార్లను తీసుకునేందుకు కుటుంబాలు మొగ్గు చూపుతున్నాయి. అందుకే భవిష్యత్తులో కూడా అమ్మకాల జోరు ఉంటుందని ఆశిస్తున్నాము," అని విక్రమ్ పవాహ్ అన్నారు.
బీఎండబ్ల్యూ నుంచి ఇండియాకు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో కొత్త ప్రాడక్టుల లాంచ్‌తో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్.
BMW India new launches : 2022లో.. బీఎండబ్ల్యూతో పాటు మిని బ్రాండ్ ప్రాడక్టులు 40శాతం(ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధి చెందినట్టు చెప్పారు విక్రమ్. ఇప్పటికే బెస్ట్ సేల్స్ నెంబర్‌ను నమోదుచేసినట్టు వివరించారు.
2018లో ఇండియాలో 10,405 వాహనాలను విక్రయించింది బీఎండబ్ల్యూ. సంస్థకు ఇండియాలో ఇప్పటివరకు ఇదే అత్యధిక నెంబర్. గతేడాది 8,236 బీఎండబ్ల్యూలు, 640 మినీ యూనిట్లను విక్రయించింది.
ఇక రానున్న ప్రాడక్ట్‌లపై మాట్లాడుతూ.. 'బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ఫోలియో చాలా మెరుగ్గా ఉంది. రానున్న 8 వారాల్లో పోర్ట్‌ఫోలియోను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతాము. వచ్చే ఏడాది తొలినాళ్లల్లోనే ఐ7 ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము,' అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ అన్నారు.
ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్ఎం లాంచ్..
BMW XM launch in India : ఇండియా మార్కెట్లోకి మరో బీఎండబ్ల్యూ వాహనం అడుగుపెట్టింది. ఫ్లాగ్షిప్ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇటీవలే లాంచ్ అయ్యింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.60కోట్లుగా ఉంది. 'ఎం' బ్రాండ్ నుంచి వస్తున్న రెండో స్టాండెలోన్ మోడల్‌గా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం గుర్తింపు పొందింది. తొలి వాహనం ఎం1.. 1978లో లాంచ్ అయ్యింది. ఇక ప్లగ్-ఇన్ హైబ్రీడ్ టెక్నాలజీతో ఎం బ్రాండ్ నుంచి వస్తున్న తొలి వాహనం ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.