BMW S 1000 RR : బీఎండబ్ల్యూ నుంచి మరో స్పోర్ట్స్ బైక్.. ధర ఎంతంటే..!
BMW S 1000 RR launched in India : బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ధర, ఫీచర్స్ వివరాలు..
BMW S 1000 RR : బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసింది బీఎండబ్ల్యూ మోటారాడ్. ఈ ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 20.25లక్షలు- రూ. 24.45లక్షల(ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంటుంది. గతంలో ఉన్న వర్షెన్స్తో పోల్చుకుంటే.. ఈ 2023 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్‌ను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఈ స్పోర్ట్స్ బైక్‌కు కాస్మొటిక్ పరమైన మార్పులు చేయడంతో పాటు ఎయిరోడైనమిక్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. పైగా.. స్టాండర్డ్, ప్రో, ప్రో ఎం స్పోర్ట్ వంటి మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తోంది.
ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 999 సీసీ, ఇన్ లైన్ 4 సిలిండర్ ఉంటుంది. ఇది 13,750 ఆర్పీఎం వద్ద 206బీహెచ్పీ పవర్‌ను, 113ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 14,600 ఆర్పీఎం వరకు కూడా వెళ్లగలదు. ఇంటేక్ ఫన్నెల్స్ డిజైన్‌లో మార్పులు చేసి.. పవర్ ఔట్‌పుట్‌ను పెంచారు. ఇందులో బీఎండబ్ల్యూ షిఫ్ట్‌క్యామ్ టెక్నాలజీ కూడా ఉంటుంది.
BMW S 1000 RR price : కాస్మొటిక్ పరంగా బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్కు కొత్త లివెరీస్ వచ్చాయి. 10కేజీల డౌన్‌ఫోర్స్‌ను జనరేట్ చేయగలిగే వింగ్లెట్స్ను ఏర్పాటు చేశారు. ఇక రేర్ సెక్షన్ విషయానికొస్తే.. బైక్‌ను రీడిజైన్ చేసినట్టుగా ఉంటుంది. స్పోర్టీ లుక్ వస్తోంది. నెంబర్ ప్లేట్ హోల్డర్ మరింత చిన్నగా ఉంది. యాక్ససరీస్‌లో భాగంగా హంప్ కవర్, ఎండ్యూరెన్స్ సీట్‌ను ఇస్తోంది సంస్థ.
ఈ బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్లో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, ఎం బ్యాటరీ వస్తాయి. ఇందులో 6.5ఇంచ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండిల్ బార్‌పై ఉన్న మల్టీ కంట్రోలర్‌తో టీఎఫ్టీ స్క్రీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇందులో ఏబీఎస్ ప్రో, బ్రేక్ స్లైడ్ అసిస్ట్, స్లిక్ సెట్టింగ్ ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్ఎం..
BMW XM price in India : బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్తో పాటు ఎక్స్ఎం ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసింది లగ్జరీ వాహనాల తయారీ సంస్థ. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.60కోట్లుగా ఉంది. 'ఎం' బ్రాండ్ నుంచి వస్తున్న రెండో స్టాండెలోన్ మోడల్‌గా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం గుర్తింపు పొందింది. తొలి వాహనం ఎం1.. 1978లో లాంచ్ అయ్యింది. ఇక ప్లగ్-ఇన్ హైబ్రీడ్ టెక్నాలజీతో ఎం బ్రాండ్ నుంచి వస్తున్న తొలి వాహనం ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం