BMW XM : ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం లాంచ్​.. ధర ఎంతంటే!-bmw xm launched in india at 2 60 crores check full details of this luxury car ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw Xm : ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం లాంచ్​.. ధర ఎంతంటే!

BMW XM : ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం లాంచ్​.. ధర ఎంతంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 10, 2022 02:46 PM IST

BMW XM launch in India : బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం ఇండియాలో లాంచ్​ అయ్యింది. ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం లాంచ్​.. ధర ఎంతంటే!
ఇండియాలో బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం లాంచ్​.. ధర ఎంతంటే! (HT AUTO)

BMW XM launch in India : ఇండియా మార్కెట్​లోకి మరో బీఎండబ్ల్యూ వాహనం అడుగుపెట్టింది. ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం తాజాగా లాంచ్​ అయ్యింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.60కోట్లుగా ఉంది. 'ఎం' బ్రాండ్​ నుంచి వస్తున్న రెండో స్టాండెలోన్​ మోడల్​గా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం గుర్తింపు పొందింది. తొలి వాహనం ఎం1.. 1978లో లాంచ్​ అయ్యింది. ఇక ప్లగ్​-ఇన్​ హైబ్రీడ్​ టెక్నాలజీతో ఎం బ్రాండ్​ నుంచి వస్తున్న తొలి వాహనం ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం.

లగ్జరీగా.. బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం..!

ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎంలో.. ట్విన్​-టర్బోఛార్జ్​డ్​ 4.4లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 653బీహెచ్​పీ పవర్​ను, 800ఎన్​ఎం పీక్​ టార్క్​ ఔట్​పుట్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మీషన్​తో పాటు ప్లగ్​-ఇన్​ హైబ్రీడ్​ సిస్టెమ్​ ఉంటుంది. 25.7కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉండటంతో.. ఓన్లీ ఎలక్ట్రిక్​ ఆప్షన్​ మీద ఈ వెహికిల్​ 88కి.మీల దూరం ప్రయాణించగలదు. 7.4కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్​ ఛార్జర్​ ఇందులో ఉంటుంది. 0-100 కేపీహెచ్​ను 4.3 సెకన్లలోనే అందుకోగలదు. ఈ లగ్జరీ ఎస్​యూవీలో అడాప్టివ్​ ఎం సస్పెన్షన్​, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్​ డ్యాంపర్స్​, కొత్త 48వీ సిస్టెమ్​ ఉన్నాయి.

స్టైలిష్​ లుక్​తో ఎక్స్​ఎం లేబుల్​ రెడ్​ కారను ఆవిష్కరించింది బీఎండబ్ల్యూ. ఈ లగ్జరీ కారు వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

BMW XM features : ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం.. ఎక్స్​7తో పోలి ఉంటుంది. కిడ్నీ గ్రిల్​, స్ప్లిట్​ హెడ్​ల్యాంప్​ సెటప్​, రేర్​లో వర్టికల్లీ స్టాకెడ్​ ఎక్సాస్ట్​ ఔట్​లెట్స్​, ఇందులో ఉన్నాయి. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎంలో 21 ఇంచ్​ వీల్స్​ ఉంటాయి. 22,23 ఇంచ్​ వీల్స్​ని కూడా కస్టమర్లు పొందవచ్చు.

ఇక బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం ఇంటీరియర్​.. ఐఎక్స్​, ఐ4తో పోలి ఉంటుంది. ఇక ఎక్స్​ఎం 12.3ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 14.9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఉంటాయి. ఐడ్రైవ్​ 8 సాఫ్ట్​వేర్​, ఏడీఏఎస్​ టెక్​, ఆంబియంట్​ లైటింగ్​, 4 జోన్​ ఆటోమెటిక్​ క్లైమెంట్​ కంట్రోల్​, హార్మన్​ కర్డోన్​ సౌండ్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఇందులో ఉంటాయి.

BMW XM price details : లంబోర్ఘిని ఉరుస్​ పర్ఫార్మంటె, ఆస్టన్​ మార్టిన్​ డీబీఎక్స్​ 707, పార్షె కయెన్నె టర్పో జీటీ వంటి లగ్జరీ కార్లకు ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఎక్స్​తో పాటు ఎం340ఐ అప్డేటెడ్​ వర్షెన్​, ఎస్​1000ఆర్​ఆర్​ సూపర్​ బైక్​ని కూడా బీఎండబ్ల్యూ లాంచ్​ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం