Lamborghini Urus Performante : లంబోర్ఘిని సూపర్​ ఎస్​యూవీ లాంచ్​.. ధర రూ. 4.22కోట్లు!-lamborghini launches urus performante in india priced at 4 22 cr ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lamborghini Launches Urus Performante In India Priced At 4.22 Cr

Lamborghini Urus Performante : లంబోర్ఘిని సూపర్​ ఎస్​యూవీ లాంచ్​.. ధర రూ. 4.22కోట్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 07:09 AM IST

Lamborghini Urus Performante India launch : లంబోర్ఘిని నుంచి సూపర్​ ఎస్​యూవీ.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ధర రూ. 4.22కోట్లుగా ఉంది. ఆ వివరాలు..

లంబోర్ఘిని నుంచి వచ్చిన కొత్త మోడల్​ ఇదే..
లంబోర్ఘిని నుంచి వచ్చిన కొత్త మోడల్​ ఇదే.. (HT AUTO)

Lamborghini Urus Performante price in India : అంతర్జాతీయ మార్కెట్​తో పాటు ఇండియాలోనూ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కొత్త కొత్త మోడల్స్​ను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే.. Lamborghini Urus Performante ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇండియాలో దీని ఎక్స్​షోరూం ధర రూ. 4.22కోట్లుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ కారు అంతర్జాతీయ మార్కెట్​లో ఈ ఏడాది ఆగస్టులో లాంచ్​ అయ్యింది. తాజాగా.. గురువారం దీనిని ఇండియాలోకి తీసుకొచ్చింది లంబోర్ఘిని.

కొత్త కొత్తగా..

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్​యూవీ Urus Performante అని లంబోర్ఘిని చెబుతోంది. ఈ కొత్త మోడల్​ డిజైన్​, ఇంటీరియర్​.. రిచ్​ లుక్​ను ఇస్తాయి. ఫ్రంట్​ బంపర్​, కార్బన్​ ఫైబర్​ స్ప్లిట్టర్​, బ్లాకడ్​ ఔట్​ ఎయిర్​ ఇంటేక్​ వెంట్స్​ సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఫ్రంట్​, రేర్​ వీల్స్​ని 16ఎంఎం వెడల్పుగా చేసింది లంబోర్ఘిని. ఎత్తును 20ఎంఎం పెంచింది. రేర్​ బంపర్​ని కూడా రీడిజైన్​ చేసింది లంబోర్ఘిని.

Lamborghini Urus Performante ఎయిరోడైనమిక్స్​ పరంగా ఫీచర్స్​ మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. కొత్తగా రేర్​ స్పాయిలర్​, ఎయిర్​ కర్టైన్స్​, బానెట్​ ఓట్​లెట్స్​ను తీసుకొచ్చింది లంబోర్ఘిని. ఫలితంగా కారు ఎయిరోడైనమిక్స్​ సామర్థ్యం 10శాతం పెరుగుతుంది. ఇంజిన్​ కూలింగ్​, బ్రేకింగ్​ సిస్టెమ్​కు కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇంటీరియర్​ అదుర్స్​..!

ఇక Lamborghini Urus Performante ఇంటీరియర్​ విషయానికొస్తే... ఈ కారు సీట్లు హెక్సాగొనల్​ డిజైన్​లో ఉంటాయి. చాలా చోట్ల Performante లోగోలు కనిపిస్తాయి. ఈ కారులో 4.0లీటర్​ ట్విన్​ టర్బోఛార్జడ్​ వీ8 ఇంజిన్​ ఉంటుంది. ఇది 666హెచ్​పీ పవర్​, 850ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. లాంచ్​ కంట్రోల్స్​, గేరింగ్​, యాక్సలేటర్​లు మరింత రెస్పాన్సివ్​గా కనిపిస్తున్నాయి.

ఈ Lamborghini Urus Performante.. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుండటం విశేషం. దీని టాప్​ స్పీడ్​ 306 కేఎంపీహెచ్​.

పాత మోడల్​కు ఎయిర్​ సస్పెన్షన్స్​ ఉండేవి. ఈ Lamborghini Urus Performanteకి కాయిల్​ స్ప్రింగ్​ సెటప్​ను ఇచ్చింది సంస్థ. ఫలితంగా హ్యాండ్లింగ్​ మరింత మెరుగ్గా ఉంటుందని లంబోర్ఘిని చెబుతోంది. మూడు ఆఫ్​ రోడ్​ మోడ్స్​కి బదులు.. ర్యాలీ మోడ్​ను ఇచ్చింది ఈ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ.

“Urus తో ఇండియాలో మా సంస్థకు మంచి క్రేజ్​ లభించింది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను లాంచ్​ చేయాలని చూస్తున్నాము. ఇందులో భాగంగానే.. Lamborghini Urus Performante ని తీసుకొచ్చాము. ఇది కస్టమర్లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది,” అని లంబోర్ఘిని ఇండియా పేర్కొంది.

WhatsApp channel

సంబంధిత కథనం