BMW CE 04 Electric Scooter: బీఎండబ్ల్యూ నుంచి ఇండియాకు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అతిత్వరలో లాంచ్: వివరాలివే
BMW CE 04 Electric Scooter: ఇండియాలో లాంచ్‍కు ముందు సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది బీఎండబ్ల్యూ. అతిత్వరలో ఇది భారత మార్కెట్‍లోకి రానుంది. ఈ స్కూటర్ వివరాలు ఇవే.
BMW CE 04 Electric Scooter: ఇండియాలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు బీఎండబ్ల్యూ సిద్దమైంది. బీఎండబ్ల్యూ సీఈ04ను అతిత్వరలో తీసుకురానుంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్‍లో ఈ స్కూటర్ ను ప్రదర్శించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‍లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కాగా.. ఇప్పుడు భారత్‍కు తీసుకొస్తోంది. డిఫరెంట్ డిజైన్, సుదీర్ఘ రేంజ్, మంచి ఫీచర్లతో ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. దీనికి సంబంధించిన చాలా వివరాలు బయటికి వచ్చాయి. BMW CE 04 Electric Scooter డిటైల్స్ ఇవే.
BMW CE 04 Electric Scooter: 129 కిలోమీటర్ల రేంజ్
బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కు 8.9 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 129 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 2.3కిలోవాట్ చార్జర్ తో నాలుగు గంటల 20 నిమిషాల్లో ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. 0 నుంచి 80 శాతం 3 గంటల 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జర్ ఉపయోగిస్తే మరింత వేగంగా చార్జ్ అవుతుందని బీఎండబ్ల్యూ వెల్లడించింది.
BMW CE 04 Electric Scooter: మంచి టాప్ స్పీడ్
BMW CE 04 Electric Scooter: లిక్విడ్ కూల్డ్ పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రొనోస్ మోటార్ తో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. ఇది 19.72 బీహెచ్‍పీ రేటింగ్‍ను కలిగి ఉంది. 4,900 ఆర్‍పీఎం వద్ద 41.4 బీహెచ్‍పీ పవర్, 1,500 ఆర్‍పీఎం వద్ద 61 ఎన్ఎం పీక్ టార్క్యూగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట ఔట్‍పుట్ ఉంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లుగా (120 kmph) ఉంది. 2.6 సెకన్లలో 0 నుంచి 50 kmph వేగానికి ఈ బైక్ యాక్సలరేట్ అవుతుంది. ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
10.25 ఇంచుల టీఎఫ్‍టీ డిస్‍ప్లే ఈ BMW CE 04 Electric Scooterకు ఉంటుంది. స్మార్ట్ ఫోన్‍కు ఈ స్కూటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. కీలెస్ రైడ్, బీఎండబ్ల్యూ మోటరాడ్ కనెక్టివిటీ, ఏబీఎస్, ఏఎస్‍సీ, ఎలక్ట్రిక్ రివర్స్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ కు కొన్ని యాక్ససరీలు కూడా అందుబాటులోకి వస్తాయి.
BMW CE 04 Electric Scooter: లాంచ్
బీఎండబ్ల్యూ సీఈ04 ఎలక్ట్రిక్ స్టూటర్.. ఇండియాలో వచ్చే నెల (2023 జనవరి)లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. భారత్‍లో ఈ స్కూటర్ ఎంత ధర ఉంటుందనే విషయాన్ని మాత్రం బీఎండబ్ల్యూ ఇంకా వెల్లడించలేదు. జనవరిలోనే తెలియనుంది.