తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Flight Tickets : విమాన టికెట్లపై ఎన్నడు లేని విధంగా డిస్కౌంట్స్​- త్వరపడితే డబ్బులు ఆదా!

Discounts on flight tickets : విమాన టికెట్లపై ఎన్నడు లేని విధంగా డిస్కౌంట్స్​- త్వరపడితే డబ్బులు ఆదా!

Sharath Chitturi HT Telugu

30 November 2024, 9:00 IST

google News
  • Air India sale : 2025లో విమాన ప్రయాణాలు చేసే వారికి అలర్ట్​! బ్లాక్​ ఫ్రైడే సేల్​లో భాగంగా రెండు దిగ్గజ విమానయాన సంస్థలు టికెట్లపై భారీ డిస్కౌంట్స్​ని ఇస్తున్నాయి. వీటి ద్వారా మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

బ్లాక్​ ఫ్రైడే సేల్​ ఎఫెక్ట్​- విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లు..
బ్లాక్​ ఫ్రైడే సేల్​ ఎఫెక్ట్​- విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లు.. (REUTERS)

బ్లాక్​ ఫ్రైడే సేల్​ ఎఫెక్ట్​- విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లు..

భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది! ఇది షాపర్లకు అద్భుతమైన డీల్స్ పొందడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి దిగ్గజ విమానయాన సంస్థలు సైతం తమ టికెట్లపై భారీ డిస్కౌంట్లను, అదనపు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. నవంబర్ 29, 2024 శుక్రవారం ప్రారంభమైన ఈ అమ్మకాలు 2024 డిసెంబర్ 2 సోమవారం రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎయిర్​ ఇండియా విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్స్​..

ఎయిర్​ ఇండియాకి చెందిన బ్లాక్ ఫ్రైడే సేల్​లో దేశీయ విమానాల్లో 20 శాతం వరకు, అంతర్జాతీయ రూట్లలో 12 శాతం వరకు ఛార్జీల తగ్గాయి. ఈ కాలంలో చేసిన బుకింగ్​లు జూన్ 30, 2025 వరకు ప్రయాణాన్ని కవర్ చేస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా లేదా నార్త్​ అమెరికా మధ్య విమానాలకు పొడిగించిన విండో అక్టోబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రయాణికులు ఈ డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదేమైనా, సీట్లు పరిమితంగా ఉంటాయని, బ్లాక్అవుట్ తేదీలు వర్తిస్తాయని గుర్తుపె్టుకోవాలి.

సాధారణంగా దేశీయ విమానాల్లో రూ.399, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.999 వరకు చెల్లించే కన్వీనియన్స్ ఫీజును రద్దు చేస్తూ విమాన టికెట్లపై మరింత డిస్కౌంట్లు ఇస్తోంది ఎయిర్​ ఇండియా. నిర్దిష్ట చెల్లింపు పద్ధతుల ద్వారా పేమెంట్​ చసే ప్రయాణీకులకు అదనపు పొదుపు లభిస్తుంది.

యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు ప్రోమో కోడ్లను ఉపయోగించి దేశీయ, అంతర్జాతీయ బుకింగ్లపై వరుసగా రూ.400, రూ.1,200 విలువైన డిస్కౌంట్లను పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు బిజినెస్ క్లాస్ టికెట్లపై రూ.3,000 వరకు, దేశీయ, అంతర్జాతీయ రౌండ్ ట్రిప్పులపై ఇతర డిస్కౌంట్లను పొందవచ్చు.

దీనికి అదనంగా, విద్యార్థులకు 25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 50 శాతం వరకు దీర్ఘకాలిక డిస్కౌంట్లను ఎయిర్ ఇండియా కొనసాగిస్తోంది. దీనిని బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లతో కలపితే డబ్బులు మరింత ఆదా అవుతాయి..

ఇండిగో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు..

ఇండిగో తన బ్లాక్ ఫ్రైడే సేల్​ను ఆవిష్కరించింది. ఇది దేశీయ రూట్స్​లో రూ .1,199, అంతర్జాతీయ గమ్యస్థానాలకు రూ .5,199 నుంచి ప్రారంభమయ్యే వన్-వే ఛార్జీలను అందిస్తుంది. జనవరి 1 నుంచి మార్చి 31, 2025 వరకు చేసే ట్రావెలింగ్​ని ఇది కవర్​ చేస్తుంది.

విమాన డిస్కౌంట్లతో పాటు, ఇండిగో అనుబంధ సేవలపై తగ్గింపులను అందిస్తోంది. ఇందులో ప్రీ-పెయిడ్ అడిషనల్​ బ్యాగేజ్ డిస్కౌంట్లు 15 శాతం, ఫాస్ట్​ఫార్వర్డ్​ సర్వీస్​ నుంచి 50 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. ఇది చెక్-ఇన్, బ్యాగేజ్ డెలివరీని వేగవంతం చేస్తుంది. దేశీయ రంగాలకు రూ.159కే ప్రయాణ సాయం అందుతుండటంతో వినియోగదారుల సౌలభ్యం పెరుగుతోంది.

ఇండిగో తన బ్లాక్ ఫ్రైడే సేల్​ని కస్టమర్లు తమ 2025 ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశంగా అభివర్ణించింది. అదే సమయంలో విమానాలు, అదనపు సేవలలో గణనీయమైన పొదుపును అందించింది. తక్కువ ఖర్చుతో నచ్చిన సీటింగ్ పొందాలనుకునే ప్రయాణికులకు కేవలం రూ.99 నుంచి డిస్కౌంట్ సీట్ల ఎంపికలను ప్రకటించింది.

పూర్తి వివరాల కోసం సంబంధిత విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్​లను చెక్​ చేయండి.

తదుపరి వ్యాసం