UPI New Feature : ఈ దేశాలకు వేళ్లేవారికి గుడ్‌న్యూస్.. పేటీఎం యూపీఐ కొత్త ఫీచర్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి
UPI New Feature : ఇటీవలి కాలంలో బయటకు వెళ్తే చెల్లింపులు అంతా ఫోన్‌తోనే. ఫోన్ ఓపెన్ చేయడం, పేమెంట్ చేసేయడం. అయితే విదేశాలకు వెళ్లేవారి కోసం పేటీఎం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి.
కొన్ని దేశాలకు వెళ్లినప్పుడు చేతిలో డబ్బులు లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెల్లింపులు చేసేందుకు సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటి వారి కోసం పేటీఎం గుడ్‌న్యూస్ చెప్పింది. పేటీఎం ఇటీవల తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. పేటీఎం కొత్త అంతర్జాతీయ యూపీఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతిస్తుంది.
పేటీఎం ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇప్పుడు యాప్‌ని ఉపయోగించి షాపింగ్, డైనింగ్, స్థానిక అవసరాల కోసం డబ్బులు చెల్లించవచ్చు. డిఫాల్ట్‌గా డిసేబుల్ చేసిన ఈ ఫీచర్‌ను వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడానికి వన్ టైమ్ యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ యూపీఐ చెల్లింపులను సెటప్ చేయడం మర్చిపోతే, ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి యాప్ ఆటోమేటిక్‌గా యూజర్‌కి మెసేజ్ పంపిస్తుంది. యూపీఐ ఆమోదించిన ప్రదేశాలలో మాత్రమే దీనిని ఉపయోగించవచ్చని మీరు గుర్తుంచుకోవాలి.
రాబోయే సెలవుల దృష్ట్యా ఈ పని వినియోగదారుల విదేశీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేటీఎం పేర్కొంది. ట్రిప్ వ్యవధిని బట్టి పేటీఎం వినియోగదారులు 1 నుండి 90 రోజుల వినియోగ వ్యవధిని ఎంచుకోవాలి. ఆ తర్వాత భద్రతా ప్రయోజనాల కోసం విదేశీ పేమెంట్స్ మూసివేస్తారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ పేటీఎం యాప్ ద్వారా విదేశాల్లో షాపింగ్, తినడం మొదలైన సేవలకు చెల్లించడానికి యూపీఐని ఉపయోగించుకోవచ్చు.
నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిగ్‌గా ఆ ఫీచర్‌ను క్లోజ్ చేస్తారు. దీనిద్వారా ప్రమాదవశాత్తు లావాదేవీలను నిరోధించడమే కాకుండా వినియోగదారుల డబ్బును మోసగించకుండా చూడవచ్చు. పైన చెప్పిన దేశాలకు టూర్ వెళ్దామనుకునేవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పేటీఎం ద్వారా మీరు ఈజీగా చెల్లింపులు చేయవచ్చు.