తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Trump Shooting : ట్రంప్​పై హత్యాయత్నం- భారీగా పెరిగిన బిట్​కాయిన్​.. కారణం ఇదే!

Trump shooting : ట్రంప్​పై హత్యాయత్నం- భారీగా పెరిగిన బిట్​కాయిన్​.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu

14 July 2024, 13:40 IST

google News
  • కొన్ని గంటల వ్యవధిలోనే బిట్​కాయిన్​ వాల్యూ భారీగా పెరిగింది! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై జరిగిన హత్యాయత్నం ఇందుకు కారణం! అసలు విషయం ఏంటంటే..

ట్రంప్​పై హత్యాయత్నం తర్వాత భారీగా పెరిగిన బిట్​కాయిన్​..!
ట్రంప్​పై హత్యాయత్నం తర్వాత భారీగా పెరిగిన బిట్​కాయిన్​..!

ట్రంప్​పై హత్యాయత్నం తర్వాత భారీగా పెరిగిన బిట్​కాయిన్​..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హత్యాయత్నం ప్రపంచ దేశాల వార్తల్లో నిలిచింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయనపై ఓ 20ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్​ చెవికి గాయమైంది. వీటిన్నింటి మధ్య బిట్​కాయిన్​ సైలెంట్​గా, భారీగా పెరిగిపోయింది! బిట్​కాయిన్ 60,000 డాలర్లకు పైగా పెరిగింది. ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పుంజుకున్నాయి. ట్రంప్​పై హత్యాయత్నానికి, బిట్​కాయిన్​ పెరగడానికి కారణం ఏంటని? ఆలోచిస్తున్నారా? ఇందుకు ఓ కారణం ఉంది.

ట్రంప్​పై హత్యాయత్నం తర్వాత బిట్​కాయిన్ ఎందుకు పెరిగింది?

ఈ ఏడాది నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ట్రంప్​ విజయావకాశాలు పెరిగాయని బ్లూమ్​బర్గ్​ నివేదించింది. ఫలితంగా బిట్​కాయిన్​ వంటి క్రిప్టోకరెన్సీలు పెరిగాయి.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉంటారు. గత నెలలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కార్యక్రమంలో "బిట్​కాయిన్ భవిష్యత్తు, తలరాతను అమెరికాలో తయారు చేస్తాను. విదేశాలకు తరలివెళ్లకుండా నేను చూసుకుంటాను," అని ట్రంప్​ చెప్పినట్లు ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. బిట్​కాయిన్, ఎథేరియం, సోలానా, డోజ్​కాయిన్, షిబా ఇను రూపంలో ట్రంప్ ప్రచార విరాళాలు స్వీకరించారని, క్రిప్టోను తమ ఆధీనంలోకి తీసుకునే హక్కుకు మద్దతు ఇచ్చారని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది.

ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం క్రిప్టో పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది.

బ్లూమ్​బర్గ్ నివేదిక ప్రకారం న్యూయార్క్​లో ఉదయం 1:05 గంటల సమయానికి బిట్కాయిన్ 2.7 శాతం పెరిగి 60,160.71 డాలర్లకు చేరుకుంది. డోజ్​కాయిన్, సోలానా, ఎక్స్ఆర్పీ సహా మరికొన్ని క్రిప్ట్ కరెన్సీలు కూడా 5% లేదా అంతకంటే ఎక్కువ లాభపడ్డాయని సీఎన్​బీసీ టీవీ 18 నివేదిక తెలిపింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రచార సభలో ఏం జరిగింది?

పెన్సిల్వేనియాలోని బట్లర్ ఫార్మ్ షోలో మాజీ అధ్యక్షుడు ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.

కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) గుర్తించింది. భద్రతా సిబ్బంది అతడిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు.

ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. ఘటనలో ఒకరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ ఘటన తర్వాత తాను బాగానే ఉన్నానని, సోమవారం మిల్వాకీ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్​కు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్​ తెలిపారు.

కొన్ని దశాబ్దాలుగా గన్​ కల్చర్​తో అమెరికా సతమతమవుతోంది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని కాల్చి చంపారు. 1968లో కాలిఫోర్నియాలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో కాల్పులకు బలయ్యారు. 1972లో ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్​ను ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు. 1981లో రొనాల్డ్ రీగన్​ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

 

.

తదుపరి వ్యాసం