తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Gaming Smartphones : రూ. 20వేల బడ్జెట్​లో ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Best gaming smartphones : రూ. 20వేల బడ్జెట్​లో ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

26 November 2023, 11:47 IST

google News
  • Best gaming smartphones under 20000 : రూ. 20వేల బడ్జెట్​లో మంచి గేమింగ్​ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

రూ. 20వేలలోపు ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!
రూ. 20వేలలోపు ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

రూ. 20వేలలోపు ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Best gaming smartphones under 20000 : మీరు ఒక గేమర్​ ఆ? మంచి గేమింగ్​ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? స్మార్ట్​ఫోన్​ హీట్​ ఎక్కకుండా.. ఎక్కువ సేపు గేమ్స్​ ఆడుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే! రూ. 20వేల బడ్జెట్​లోపు.. ఇండియాలో ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​..

ఇన్ఫీనిక్స్​ నోట్​ 30 5జీ:- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే ఉంటుంది. ఆక్టా- కోర్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 6080 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంది. మలీ జీ57 ఎంసీ2 జీపీయూ కూడా లభిస్తోంది. 8 జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ దీని సొంతం. యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, ఈ-కంపాస్​, గైరోస్కోప్​, లైట్​ సెన్సార్​, ప్రాక్సిమిటీ సెన్సార్​ వంటి సెన్సార్​లు ఉన్నాయి. ఈ మోడల్​ ధర రూ. 15,999.

రియల్​మీ నార్జో 60 5జీ:- ఇందులో 6.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 64ఎంపీ+ 2ఎంపీ రేర్​ కెమెరా దీని సొంతం. 5,00ఎంఏహెచ్​ బ్యాటరీ, 33 వాట్​ ఫాస్ట్​ చార్జింగ్​ సపోర్ట్​ ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 17,999.

ఇదీ చూడండి:- Red magic 9 pro : రెడ్​ మ్యాజిక్​ 9 ప్రో సిరీస్​ లాంచ్​.. ది బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​​ ఇవే!

Budget friendly smartphones : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 లైట్​ 5జీ:- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ దీని సొంతం. 200పర్సెంట్​ వాల్యూమ్​ మోడ్​ ఉంది. 108ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా వస్తోంది. ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. ధర రూ. 21,999.

మోటోరోలా జీ54 5జీ:- ఈ గ్యాడ్జెట్​ (8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​) ధర రూ. 16,999. ఇందులో 6.5 ఇంచ్​ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీత కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా వస్తోంది. సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా లభిస్తోంది. అల్ట్రా- రెస్​ వీడియో, డ్యూయెల్​ క్యాప్చర్​, స్పాట్​ కలర్​, నైట్​ విజన్​, మాక్రో విజన్​, పోట్రైట్​ వంటి మోడ్స్​ ఉన్నాయి.

తదుపరి వ్యాసం