Red magic 9 pro : రెడ్ మ్యాజిక్ 9 ప్రో సిరీస్ లాంచ్.. ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Red magic 9 pro : గేమర్స్‌కి క్రేజీ న్యూస్! క్రేజీ ఫీచర్స్‌తో సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. దీని పేరు రెడ్ మ్యాజిక్ 9 ప్రో! ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Red magic 9 pro : చైనా మార్కెట్లో మరో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. దాని పేరు రెడ్ మ్యాజిక్ 9 ప్రో. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. రెడ్ మ్యాజిక్ 9 ప్రో, రెడ్ మ్యాజిక్ 9 ప్రో+. ఈ నేపథ్యంలో ఈ మొబైల్స్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే..
రెడ్ మ్యాజిక్ 9 ప్రో సిరీస్‌లో.. 120 హెచ్‌జెడ్‌తో కూడిన 6.8 ఇంచ్ ఫుల్ స్క్రీన్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ మొబైల్స్ సొంతం. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజ్ వంటివి ఈ మొబైల్స్‌లో భాగం. వేపర్ ఛాంబర్, అలాయ్ ఫ్యాన్, వాటర్‌ఫాల్ ఎయిర్ డక్ట్, క్యూబ్ ఎనర్జీ ఇంజిన్ వంటి కూలింగ్ సిస్టెమ్ ఫీచర్స్ కూడా వీటిల్లో ఉన్నాయి. ఫలితంగా.. హీట్ అనేది 25డిగ్రీ సెల్సియస్ వరకు దిగొస్తుంది.
ఇక రెడ్ మ్యాజిక్ 9 ప్రో సిరీస్‌లో రెడ్ కోర్ ఆర్2 ప్రో చిప్సెట్ కూడా వస్తోంది. ఫలితంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది మరింత మెరుగ్గా ఉంటుంది.
Red magic 9 pro price : ఈ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ కూడా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రెడ్‌మ్యాజిక్ ఓఎస్ 9.0 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి. ఎక్స్ గ్రావిటీ 2.0 సాఫ్ట్వేర్ కూడా వీటిల్లో ఉంటుంది. కంట్రోలర్స్, కీబోర్డ్స్, మౌస్ వంటిని అటాచ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ రెడ్ మ్యాజిక్ 9ప్రోలో 6,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి ఉంటాయి. కేవలం 35నిమిషాల్లోనే ఈ గ్యాడ్జెట్‌ని ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక రెడ్ మ్యాజిక్ 9 ప్రో+ లో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ, 165వాట్ అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ వంటివి ఉంటాయి. ఫుల్ ఛార్జింగ్‌కి కేవలం 16 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది!
Red magic 9 pro plus price : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా.. 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన రేర్ కెమెరా సెటప్ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ కెమెరా లభిస్తుంది.
ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ ధరలు ఎంతంటే..
చైనాలో.. రెడ్ మ్యాజిక్ 9 ప్రో 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లుగా ఉంది. అంటే.. సుమారు రూ. 51,691. 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,399 యువాన్లుగా ఉంది. అంటే సుమారు రూ. 63,441.
Red magic 9 pro launch dat in India : ఇక రెడ్ మ్యాజిక్ 9 ప్రో+ 16జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,499 యువాన్లుగా ఉంది. అంటే సుమారు రూ. 64,616. ఇక 24జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 యువాన్లుగా ఉంది. అంటే సుమారు రూ. 82,242.
చైనాలో ఈ నెల 28న ఈ మోడల్ సేల్స్ ప్రారంభమవుతాయి. బ్లాక్, వైట్ (ట్రాన్స్పరెంట్), బ్లాక్ (ట్రాన్స్పరెంట్) కలర్ ఆప్షన్స్ వంటివి ఉంటాయి.
కాగా.. ఇండియాలో ఈ రెడ్ మ్యాజిక్ 9 ప్రో సిరీస్ లాంచ్‌పై ప్రస్తుతం స్పష్టత లేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం