Best camera phones: మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇవే బెస్ట్..
14 November 2023, 18:55 IST
Best camera phones: రూ. 20 వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. ఈ ఆప్షన్స్ చెక్ చేయండి.
ప్రతీకాత్మక చిత్రం
Best camera phones: స్మార్ట్ ఫోన్ కొనేముందు ఇప్పుడు చాలా మంది ఆ ఫోన్ లోని కెమెరా క్వాలిటీని పరిశీలిస్తున్నారు. మంచి క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్ నే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రూ. 20 వేల లోపు ధరలో లభించే బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..
Samsung Galaxy A23: సామ్సంగ్ గెలాక్సీ ఏ 23
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 23 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ఇది 10x వరకు డిజిటల్ జూమ్‌తో 50 MP OIS క్వాడ్ కెమెరాను కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 6GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని పొందుపర్చారు.
Lava Agni 2: లావా అగ్ని 2
ఈ లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లో 50MP క్వాడ్ మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో, 2MP డెప్త్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 6 ఎన్ఎం ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్లో సూపర్‌ఫాస్ట్ 66W ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 4700mAh బ్యాటరీ ని పొందుపర్చారు.
Oppo A79: ఒప్పొ ఏ 79
ఒప్పొ ఏ 79 స్మార్ట్‌ఫోన్‌లో కృత్రిమ మేథ ఆధారిత 50MP మెయిన్ కెమెరా, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లేను పొందుపర్చారు. ఈ ఫోన్లో సూపర్‌ఫాస్ట్ 33W ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ ని అమర్చారు. ఇందులో 8 ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
iQOO Z7s: ఐక్యూ జీ 7 ఎస్
ఈ స్మార్ట్‌ఫోన్ 1300 nits పీక్ లోకల్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 MP OIS అల్ట్రా స్టేబుల్ కెమెరా, 2MP బోకె కెమెరా మరియు 16MP ఫ్రంట్ కెమెరా లను అమర్చారు. దీని కెమెరా ఫీచర్లలో అల్ట్రా స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్, మైక్రో మూవీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, డబుల్ ఎక్స్‌పోజర్ మొదలైన అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4500 mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
Poco X5 Pro: పొకో ఎక్స్ 5 ప్రొ
ఈ పొకో ఎక్స్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ 108 ఎంపీ మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో 8 GB RAM, 256 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది.