Bank holidays : కస్టమర్స్‌కి అలర్ట్- బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు!
14 September 2024, 8:10 IST
Bank holidays in September : బ్యాంకు పనుల మీద వెళ్లే వారికి అలర్ట్! దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెప్టెంబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వరుసగా 5 రోజులు సెలవులు!
బ్యాంకు కస్టమర్స్‌కి అలర్ట్! సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా అనేక బ్యాంక్‌లకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్‌ని తెలుసుకుని కస్టమర్లు అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతీయ, జాతీయ, వారాంతపు సెలువులు ఉన్నాయి. సెలవుల షెడ్యూల్ కోసం మీరు మీ స్థానిక బ్యాంక్ బ్యాంచ్ లేదా యాప్ నోటిఫికేషన్లను చెక్ చేయాల్సి ఉంటుంది.
మొత్తంమీద, భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు సెప్టెంబర్ 2024లో కనీసం 14 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. అందుకు అనుగుణంగా మీ బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవడం మంచిది.
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్స్‌ని నిర్వహిస్తాయి - నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఎటిఎంలను అయినా యాక్సెస్ చేయవచ్చు. ఇక సెప్టెంబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు బ్యాంక్ సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంకులకు వరుస సెలవులు..
సెప్టెంబర్ 14 - రెండవ శనివారం / ఓనం - భారతదేశం / కేరళ
సెప్టెంబర్ 15 - ఆదివారం / తిరువోణం - భారతదేశం / కేరళ
సెప్టెంబర్ 16 - ఈద్-ఎ-మిలాద్ (సోమవారం) - భారతదేశం అంతటా సెలవు
సెప్టెంబర్ 17 - గణేశ నిమజ్జనం (మంగళవారం)- అన్ని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 18 - శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) - కేరళలోని బ్యాంకులకు సెలవు.
వీటితో పాటు, తరువాతి వారం కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 21 (శ్రీ నారాయణ గురు సమాధి - కేరళ), సెప్టెంబర్ 22 (ఆదివారం - పాన్-ఇండియా), మరియు సెప్టెంబర్ 23 (వీరమరణ దినం - హర్యానా) సెలవులు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత నాలుగో శనివారం, చివరి ఆదివారాలు అంటే సెప్టెంబర్ 28, 29 తేదీలను కూడా సెలవు దినాలుగా పరిగణిస్తారు.
గత సెలవులు: సెప్టెంబర్ 1 (ఆదివారం), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 8 (ఆదివారం).
వీటితో పాటు, తరువాతి వారం కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 21 (శ్రీ నారాయణ గురు సమాధి - కేరళ), సెప్టెంబర్ 22 (ఆదివారం - పాన్-ఇండియా), మరియు సెప్టెంబర్ 23 (మార్టియర్ డే - హరియాణా) సెలవులు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత నాలుగో శనివారం, చివరి ఆదివారాలు అంటే సెప్టెంబర్ 28, 29 తేదీలను కూడా సెలవు దినాలుగా పరిగణిస్తారు.
గత సెలవులు: సెప్టెంబర్ 1 (ఆదివారం), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 8 (ఆదివారం).
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ- స్థానిక సందర్భాలు, కార్యాచరణ అవసరాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ప్రకటన చేస్తుంది.