TG School Holidays : రేపటి నుంచి విద్యా సంస్థలకు వరుస సెలవులు! కారణం ఇదే
- TG School Holidays : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలకు మూడు రోజులు సెలువులు ఉంటే.. కొన్ని పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.
- TG School Holidays : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలకు మూడు రోజులు సెలువులు ఉంటే.. కొన్ని పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.
(1 / 5)
ఈ వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.(HT)
(2 / 5)
సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం. 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు వచ్చాయి. 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి.. ఆ రోజు సెలవు ఉంటుంది. (HT)
(3 / 5)
17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉంది. దీంతో వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారింది. (HT)
(4 / 5)
నెలవంక దర్శనాన్ని బట్టి మిలాద్ ఉన్ నబీ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. దీంతో 16వ తేదీన సెలవును రద్దు చేశారు. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. నెలవంక 16న కపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుస సెలవులు ఉండనున్నాయి.(HT)
ఇతర గ్యాలరీలు