Bank holidays in January 2023 : జనవరిలో బ్యాంక్‌లకు 11 రోజుల పాటు సెలవులు
26 December 2022, 10:35 IST
- Bank holidays in January 2023 : 2023 జనవరికి సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్ బయటకొచ్చింది. వచ్చే నెలలో బ్యాంక్‌లకు 11 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
జనవరిలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే..
List of Bank holidays in January 2023 : జనవరి నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 2023 మొదటి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్‌ను కచ్చితంగా చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక జనవరి నెలలో 11 రోజుల పాటు బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
2023 జనవరి బ్యాంక్ సెలవులు..
January 2023 Bank holidays : జనవరి 2- సోమవారం, న్యూ ఇయర్ వేడుకలు (ఐజ్వాల్‌లోని బ్యాంక్‌లకు సెలవు)
జనవరి 3- మంగళవారం, ఇమోను ఇరాప్ట (ఇంపాల్లోని బ్యాంక్‌లకు సెలవు)
జనవరి 4- బుధవారం, గాన్- ఎన్‌గై (ఇంపాల్లోని బ్యాంక్‌లకు సెలవు)
జనవరి 26- గురువారం, రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్‌లకు సెలవు)
సాధారణ సెలవులు..
2023 Bank holidays list : జనవరి 1- ఆదివారం
జనవరి 8- ఆదివారం
జనవరి 14- రెండో శనివారం, భోగి
జనవరి 15- ఆదివారం సంక్రాంతి
జనవరి 22- ఆదివారం
జనవరి 28- నాలుగో శనివారం
పైన చెప్పిన తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్‌లకు సెలవులు ఉంటాయి.
ఈ ఏడాది ఆగస్టు నుంచి..
ఇక డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు లభించాయి. నవంబర్‌లో బ్యాంక్‌లకు 10 రోజుల సెలవుల లభించింది. దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్ అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోల్చుకుంటే.. నవంబర్, డిసెంబర్లో బ్యాంక్ సెలవులు తగ్గాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంక్‌లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్‌లో బ్యాంక్‌లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్‌లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.
బ్యాంక్‌లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్బీఐ విడుదల చేస్తుంది. వీటిని రెగ్యురల్‌గా చెక్ చేసుకుని కస్టమర్లు బ్యాంక్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్ని విషయాన్ని మర్చిపోకూడదు.