Bank holidays in December 2022 : డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు..
Bank holidays in December 2022 : డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ ప్రకటించింది. ఆ వివరాలు..
Bank holidays in December 2022 : డిసెంబర్ నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్‌ను కచ్చితంగా చూసి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
డిసెంబర్లో బ్యాంక్ సెలవుల వివరాలు..
- డిసెంబర్ 3:- ఫీస్ట్ ఆఫ్ సెంట్ జేవియర్స్. గోవా బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 12:- పా టోగాన్ నెంగ్మింజా సంగ్మ. షిల్లాంగ్‌లో బ్యాంక్‌లకు సెలవు
- December bank holidays list డిసెంబర్ 19:- గోవా లిబరేషన్ డే. గోవా బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 24:- క్రిస్ట్మస్ ఈవ్. షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 26:- క్రిస్ట్మస్ సెలబ్రేషన్స్/లూసాంగ్/నామ్‌సాంగ్- ఐజాల్, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 29:- గురు గోబింద్ సింగ్ జయంతి. ఛండీగడ్ బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 30:- యూ కియాంగ్ నంగ్బాఘ్. షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
- డిసెంబర్ 31:- న్యూ ఈయర్ ఈవ్, ఐజాల్ బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ నెలలో సాధారణ సెలవులు..
- డిసెంబర్ 4:- ఆదివారం
- డిసెంబర్ 10:- రెండో శనివారం
- List of bank holidays in December : డిసెంబర్ 11:- ఆదివారం
- డిసెంబర్ 18:- ఆదివారం
- డిసెంబర్ 24:- నాలుగో శనివారం
- డిసెంబర్ 25:- క్రిస్ట్మస్, ఆదివారం
Bank holidays latest news : నవంబర్‌లో బ్యాంక్‌లకు 10 రోజుల సెలవుల లభించింది. దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్ అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోల్చుకుంటే.. నవంబర్‌లో బ్యాంక్ సెలవులు తగ్గాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంక్‌లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్‌లో బ్యాంక్‌లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్‌లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.
Bank holidays in 2022 : బ్యాంక్‌లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్బీఐ విడుదల చేస్తుంది. వీటిని రెగ్యురల్‌గా చెక్ చేసుకుని కస్టమర్లు బ్యాంక్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్ని విషయాన్ని మర్చిపోకూడదు.
సంబంధిత కథనం