Bank interest rates: 9% వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే..
07 December 2022, 18:23 IST
Bank interest rates: ఆర్బీఐ రెపొ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాాతానికి చేరింది.
ప్రతీకాత్మక చిత్రం
Bank interest rates: డిసెంబర్ ఆర్బీఐ పెంచిన 35 బేసిస్ పాయింట్లతో రెపొ రేటు 6.25 శాతానికి చేరింది. 2018 ఆగస్ట్ తరువాత ఇదే అత్యధికం. రెపొ రేటు పెంచిన కారణంగా బ్యాంకులు కూడా రుణాలపై, డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, సెప్టెంబర్ లో అత్యధికంగా 7.41% గా ఉన్న ద్రవ్యోల్బణం అక్టోబర్ లో 6.77 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 9% వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవి.
Bank interest rates: సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Suryoday Small Finance Bank)
ఫిక్స్ డ్ డిపాజిట్లపై సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Suryoday Small Finance Bank) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ అత్యధికంగా 9.26% వడ్డీ ఇస్తోంది. ఇతరులకు అది 9.01%గా ఉంది.
Bank interest rates: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Unity Small Finance Bank)
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Unity Small Finance Bank) కూడా వడ్డీ రేట్లను ఇటీవల సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. 181 రోజుల కాల వ్యవధి, 501 రోజుల కాల వ్యవధితో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Unity Small Finance Bank) 8.5% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది 9%గా ఉంది.
Bank interest rates: గృహ రుణాలపై..
మరోవైపు, రెపొ రేటు పెరుగుదల వల్ల ఇంటి కొనుగోలు రుణాలపై వడ్డీ రేటు కూడా పెరగనుంది. క్రమంగా పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ఇప్పటికే ఇళ్ల కొనుగోలుపై ప్రతికూల ప్రభావం పడింది.