Bank holidays in July : జులైలో బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులే! పూర్తి లిస్ట్ ఇదిగో..
30 June 2023, 9:47 IST
- Indian Bank holidays in July : జులైలో బ్యాంక్‌లకు 15 రోజుల పాటు సెలవులు ఉండనున్నయి. ఆర్బీఐ విడదుల చేసిన లిస్ట్‌ను ఇక్కడ చూడండి.
ఇండియా బ్యాంక్ హాలీడే లిస్ట్..
Bank holidays in July 2023 : జులైలో బ్యాంక్‌లకు 15 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వీటిల్లో ఆది, రెండు- నాలుగు శనివారాలు కూడా ఉన్నాయి. వచ్చే నెలకు సంబంధించిన బ్యాంక్ హాలీడే లిస్ట్‌ను ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. 15లో 8 సెలవులు నెగోషియెబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ కింద ఉన్నాయి. మిగిలినవి వీకెండ్ సెలవులు కావడం గమనార్హం. కాగా.. ప్రతి నెల మొదటి, మూడోవ శనివారం బ్యాంక్‌లకు సెలవు ఉండదు అన్న విషయం తెలిసిందే.
వచ్చే నెలలో ఉన్న సెలవుల్లో కొన్ని రాష్ట్రాల ఆధారంగా ఉన్నాయి. నేషనల్ హాలీడేలో మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతపడే ఉంటాయి.
జులైలో బ్యాంక్ సెలవుల వివరాలు..
జులై 2 2023:- ఆదివారం
జులై 5 2023:- గురు హర్గోబింద్ సింగ్ జయంతి. జమ్ము- శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
జులై 6 2023:- ఎంహెచ్ఐపీ డే. మిజోరంలోని బ్యాంక్‌లకు సెలవు.
జులై 8 2023:- రెండో శనివారం.
జులై 9 2023:- ఆదివారం
జులై 11 2023:- కేర్ పూజ. త్రిపురలోని బ్యాంక్‌లకు హాలీడే.
జులై 13 2023:- భాను జయంతి. సిక్కింలోని బ్యాంక్‌లకు సెలవు.
జులై 16 2023:- ఆదివారం.
ఇదీ చూడండి:- 2023లో బ్యాంక్ సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
జులై 17 2023:- యూ టిరోట్ సింగ్ డే. మేఘాలయలోని బ్యాంక్‌లకు హాలీడే.
జులై 21 2023:- ద్రుప్కా టెషి-జి, గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
జులై 22 2023:- నాలుగో శనివారం.
జులై 23 2023:- ఆదివారం.
జులై 29 2023:- మొహర్రం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
జులై 30 2023:- ఆదివారం
జులై 31 2023:- మార్టీడం డే. హరియాణా, పంజాబ్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఇవి పనిచేస్తాయి..
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.
బ్యాంక్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్‌ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడతారు.
ఆగస్ట్‌లో బ్యాంక్ సెలవులివే..!
ఆగస్ట్ 15:- మంగళవారం, స్వాతంత్ర్య దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు.
ఆగస్ట్ 16:- బుధవారం, పార్సీ న్యూ ఇయర్
Bank Holidays 2023 Hyderabad : ఆగస్ట్ 31:- గురువారం, రక్షా బంధన్. దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు.
వీటితో పాటు వీకెండ్ సెలవులు కూడా ఉండనున్నాయి.
మరోవైపు బ్యాంక్‌లకు జూన్ నెలలో 12 రోజుల పాటు సెలవు లభించింది.