తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In December 2022 : డిసెంబర్​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు..

Bank holidays in December 2022 : డిసెంబర్​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు..

28 November 2022, 7:45 IST

google News
    • Bank holidays in December 2022 : డిసెంబర్​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ను ఆర్​బీఐ ప్రకటించింది. ఆ వివరాలు..
డిసెంబర్​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు..!
డిసెంబర్​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు..!

డిసెంబర్​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు..!

Bank holidays in December 2022 : డిసెంబర్​​ నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల వివరాలను ఆర్​బీఐ(రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్​ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్​ను కచ్చితంగా చూసి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్​కు వెళ్లాల్సి ఉంటుంది.

ఇక డిసెంబర్​​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

డిసెంబర్​లో బ్యాంక్​ సెలవుల వివరాలు..

  • డిసెంబర్​ 3:- ఫీస్ట్​ ఆఫ్​ సెంట్​ జేవియర్స్​. గోవా బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 12:- పా టోగాన్​ నెంగ్​మింజా సంగ్మ. షిల్లాంగ్​లో బ్యాంక్​లకు సెలవు
  • December bank holidays list డిసెంబర్​ 19:- గోవా లిబరేషన్​ డే. గోవా బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 24:- క్రిస్ట్​మస్​ ఈవ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 26:- క్రిస్ట్​మస్​ సెలబ్రేషన్స్​/లూసాంగ్​/నామ్​సాంగ్​- ఐజాల్​, గ్యాంగ్​టక్​, షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 29:- గురు గోబింద్​ సింగ్​ జయంతి. ఛండీగడ్​ బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 30:- యూ కియాంగ్​ నంగ్​బాఘ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
  • డిసెంబర్​ 31:- న్యూ ఈయర్​ ఈవ్​, ఐజాల్​ బ్యాంక్​లకు సెలవు

డిసెంబర్​ నెలలో సాధారణ సెలవులు..

  • డిసెంబర్​ 4:- ఆదివారం
  • డిసెంబర్​ 10:- రెండో శనివారం
  • List of bank holidays in December : డిసెంబర్​ 11:- ఆదివారం
  • డిసెంబర్​ 18:- ఆదివారం
  • డిసెంబర్​ 24:- నాలుగో శనివారం
  • డిసెంబర్​ 25:- క్రిస్ట్​మస్​, ఆదివారం

Bank holidays latest news : నవంబర్​లో బ్యాంక్​లకు 10 రోజుల సెలవుల లభించింది. దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్​ అక్టోబర్​ నెలాఖరుతో ముగిసింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్​, అక్టోబర్​లతో పోల్చుకుంటే.. నవంబర్​లో బ్యాంక్​ సెలవులు తగ్గాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్​లో బ్యాంక్​లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్​లో బ్యాంక్​లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్​లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.

Bank holidays in 2022 : బ్యాంక్​లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్​బీఐ విడుదల చేస్తుంది. వీటిని రెగ్యురల్​గా చెక్​ చేసుకుని కస్టమర్లు బ్యాంక్​లకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్ని విషయాన్ని మర్చిపోకూడదు.

తదుపరి వ్యాసం