తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Bank And Hdfc Merger: ‘Hdfc’ విలీనానికి మరింత సమయం

HDFC Bank and HDFC Merger: ‘HDFC’ విలీనానికి మరింత సమయం

HT Telugu Desk HT Telugu

25 November 2022, 22:46 IST

google News
  • HDFC Bank and HDFC Merger: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తో హెచ్ డీ ఎఫ్ సీ సంస్థ విలీనం పూర్తి కావడానికి మరింత సమయం పట్టనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

HDFC Bank and HDFC Merger: హెచ్ డీ ఎఫ్ సీ(HDFC) తో విలీనం ప్రక్రియ పూర్తిగా ముగియడానికి ఇంకా కనీసం 8 నుంచి 10 నెలల సమయం పట్టే అవకాశముందని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) శుక్రవారం ప్రకటించింది. గృహ రుణాల సెగ్మెంట్లో కీలకంగా ఉన్న హెచ్ డీ ఎఫ్ సీ(HDFC) తో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) విలీన ప్రక్రియ చాలా రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే.

HDFC Bank and HDFC Merger: 40 బిలియన్ డాలర్ల డీల్

హెచ్ డీ ఎఫ్ సీ(HDFC)తో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) విలీనం డీల్ దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువైనది. ఇది భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ధ విలీనం కానుంది. ఈ రెండు సంస్థలు శుక్రవారం వేర్వేరుగా సమావేశమై, ఈ విలీనానికి షేర్ హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించాయి. హెచ్ డీ ఎఫ్ సీ(HDFC) తో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) విలీనంపై తొలిసారి ఈ రెండు సంస్థలు ఈ సంవత్సరం ఏప్రిల్ లో ప్రకటన చేశాయి. మొత్తం విలీన ప్రక్రియ పూర్తి కావడానికి 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని అప్పుడు అవి ప్రకటించాయి. విలీనం అయ్యే తేదీని ప్రకటించడానికి ఇంకా కనీసం 8 నెలల సమయం పడుతుందని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) సీఈఓ శశిధరన్ తెలిపారు. మరోవైపు, విలీనం అనంతరం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) బోర్డులో తాను చేరబోవడం లేదని హెచ్ డీ ఎఫ్ సీ(HDFC) చైర్మన్ దీపక్ పరేఖ్ వెల్లడించారు. తన వయస్సు రీత్యా ఆ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే, హెచ్ డీ ఎఫ్ సీ(HDFC) కి చెందిన ఇతర బోర్డు సభ్యుల్లో కొందరు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) బోర్డులో చేరుతారన్నారు.

HDFC Bank and HDFC Merger: ఉద్యోగుల విలీనం

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) లో ప్రస్తుతం 1.61 లక్షల మంది ఉద్యోగులున్నారని, అలాగే, హెచ్ డీ ఎఫ్ సీ(HDFC)లో 508 బ్రాంచ్ లు, 3500 మంది ఉద్యోగులున్నారని, విలీనం అనంతరం వారంతా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank) ఉద్యోగులుగా కొనసాగుతారని శశిధరన్ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం