ASBL Landmark : మొదటి రోజే రూ. 500 కోట్ల సేల్స్- కూకట్పల్లి ఏఎస్బీఎల్ ల్యాండ్మార్క్కి భారీ డిమాండ్!
23 September 2024, 9:41 IST
- ASBL Landmark Kukatpally : కూకట్‌పల్లిలో తలపెట్టిన ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసిన మొదటి రోజే రూ. 500 విలువ చేసే సేల్స్ జరిగాయి.
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్
హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌లో ఒకటైన ఏఎస్బీఎల్ సరికొత్త మైలురాయిని సాధించింది. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద చేపట్టిన లేటెస్ట్ ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసిన మొదటి రోజే ఏకంగా రూ. 500 కోట్లు విలువ చేసే సేల్స్ జరిగాయి! అధునాత నగర అవసరాలు, రెసిడెన్షియల్ స్పేస్‌కి హైదరాబాద్‌లో ఉన్న డిమాండ్‌కి ఇది అద్ధం పడుతోంది.
ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ వివరాలు..
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద తలపెట్టిన ఈ ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ని 6.6 ఎకరాల్లో నిర్మించడం జరుగుతుంది. 3, 3.5, 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి. స్టైల్, కంఫర్ట్, అధునాతన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం జరుగుతుందని సంస్థ వెల్లడించింది. జీ+4 క్లబ్‌హౌస్, కో-వర్కింగ్ స్పేస్, బాంక్వేట్ హాల్, సూపర్‌మార్కెట్ సహా ఈ ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్‌లో 52వేల స్క్వేర్ ఫీట్ ఇండోర్ ఎమినిటీస్ ఉంటాయి. పంచతంత్రం థీమ్‌తో పిల్లల ఆట స్థలం వంటివి ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణ!
కూకట్‌పల్లిలో ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ గురించి సంస్థ సీఈఓ అజితేష్ కొరుపోలు మాట్లాడారు.
"సాధారణానికి మించిన లివింగ్ స్పేసెస్‌ని రూపొందించాలన్న విజన్ మాకు ఉంది. నగరాల్లోని కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ఏఎస్బీఎల్ ల్యాండ్మార్క్ని నిర్మిస్తాము. హై- క్వాలిటీ ఇళ్లను డెలివరీ చేయడానికి మేము కట్టుబడి ఉన్నట్టు చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనం. ప్రజలు మా మీద ఉంచిన నమ్మకానికి గర్వంగా ఉంది," ని అజితేష్ అన్నారు.
ఇదీ చూడండి:- కారులో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. త్వరలోనే ఫ్లైయింగ్ కార్లు లాంచ్ అయ్యే అవకాశం!
కూకట్పల్లి ఏఎస్బీఎల్ ల్యాండ్మార్క్ని ప్రైమ్ లొకేషన్లో కడుతుంటడం విశేషం. రీటైల్ హబ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ సెంటర్స్‌తో పాటు అనేక వాటికి ఈజీ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి పక్కనే రానున్న రోజుల్లో లేక్‌షోర్ మాల్ కూడా వస్తోంది. దీనితో రెసిడెంట్స్ అనుభవం మరింత పెరుగుతుంది. బాలా నగర్ మెట్రో స్టేషన్ కూడా కేవలం 10 నిమిషాల దూరంలో ఉండటంతో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మరింత మెరుగ్గా ఉన్నట్టు!
ఈ ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ సక్సెస్‌తో సరికొత్త ఇన్నోవేషన్స్‌తో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి మరింత దూకుడుగా వెళతామని సంస్థ చెబుతోంది. కంపెనీకి ఉన్న దూరదృష్టి, సంస్థ వృద్ధిలో కనిపిస్తోందని వెల్లడించింది.
ఏఎస్బీఎల్ గురించి..
ఏఎస్బీఎల్కి ఇప్పటికే 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ డెవల్మెంట్ అనుభవం ఉంది. ఏఎస్బీఎల్ లేక్‌సైడ్, ఏఎస్బీఎల్ స్పైర్, ఏఎస్బీఎల్ స్పెక్ట్రా, ఏఎస్బీఎల్ స్ప్రింగ్, ఏఎసబీఎల్ లాఫ్ట్ వంటి ప్రాజెక్ట్స్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి. 2022లో రూ. 1250 కోట్లుగా ఉన్న వార్షిక సేల్స్, 2023లో రూ. 2,200కి పెరిగింది. ఇక ఇపపుడు ఏఎస్బీఎల్ ల్యాండ్‌మార్క్ లాంచ్‌తో సరికొత్త మైలురాయికి సంస్థ చేరుకుంది.
ఇతర వివరాల కోసం ఏఎస్బీఎల్ అధికారిక వెబ్సైట్ https://asbl.in/ ని సందర్శించండి.