Real Estate Expo: హైటెక్స్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో-150కి పైగా ప్రాజెక్టులు డిస్ ప్లే
14 September 2024, 14:12 IST
- Hyderabad Real Estate Expo 2024 : హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ ఎక్స్ పో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభం అయింది. టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్ పో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 50కి పైగా ప్రముఖ డెవలపర్‌లు 150కి పైగా ప్రాజెక్ట్‌లు ఎక్స్ పో పెట్టారు.
హైటెక్స్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో-150కి పైగా ప్రాజెక్టులు
Hyderabad Real Estate Expo 2024 : హైదరాబాద్ అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో - టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2024 శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది. టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 నాల్గో ఎడిషన్ సెప్టెంబర్ 14, 15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి, గృహాలను కోరుకునేవారికి, పెట్టుబడిదారులకు ఈ ప్రాపర్టీ ఎక్స్ పో సరైన వేదిక అని టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్ పో నిర్వాహకులు తెలిపారు.
ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభోత్సవానికి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ వెంకట్ రవి, రాజపుష్ప ప్రాపర్టీస్ కార్తీక్ మహేంద్రకర్, హోనర్ హోమ్స్ పవన్ కుమార్ యెనుగా, హోనర్ హోమ్స్ ఐశ్వర్య, అంకురా హోమ్స్ అవినాష్, రాధేయ్ కన్‌స్ట్రక్షన్స్ కీయా కార్వాంకర్, లాన్సమ్ మహమ్మద్ గౌస్ అలీ హాజరయ్యారు.
హైదరాబాద్ ప్రీమియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌ట్రావాగాంజా, మునుపటి ఎడిషన్‌ల అఖండ విజయాన్ని సాధించాయని నిర్వహకులు తెలిపారు. టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2024 ఒక మైలురాయి ఈవెంట్ అని, ఇందులో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, హోనర్ హోమ్స్, రాజపుష్ప ప్రాపర్టీస్‌తో సహా 50కి పైగా ప్రసిద్ధ డెవలపర్‌లు పాల్గొంటున్నారని తెలిపారు. 150కి పైగా ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఎక్స్ పో ఉన్నాయని...వినియోగదారులకు అభిరుచి, ప్రాధాన్యత, బడ్జెట్‌కు అనుగుణంగా విభిన్నమైన హోమ్ లు ఉన్నాయన్నారు.
టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2024 రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఏజెంట్‌లకు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడానికి, కస్టమర్లకు అవగాహన కల్పించడానికి సమగ్ర వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను హైలైట్ చేయడమే కాకుండా సిటీ పెట్టుబడి అవకాశాలను కూడా హైలైట్ చేస్తుందన్నారు. మార్కెట్ ట్రెండ్‌లు, ఫైనాన్సింగ్ ఎంపికలపై అవగాహన పొందడానికి పరిశ్రమ నిపుణులు, తోటి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులతో చర్చించే అవకాశాన్ని సందర్శకులకు కల్పిస్తుదన్నారు.