తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Macbook Air : ఎం3 చిప్​తో రెండు యాపిల్​ మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​​ లాంచ్​..

Apple MacBook Air : ఎం3 చిప్​తో రెండు యాపిల్​ మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

05 March 2024, 6:16 IST

  • ఎం3 చిప్​సెట్​తో కూడిన కొత్త మ్యాక్​బుక్​ ఎయిర్​ని లాంచ్​ చేసింది యాపిల్​ సంస్థ. ఇది.. రెండు మోడల్స్​లో అందుబాటులోకి వచ్చింది. వీటి ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాపిల్​ కొత్త మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​ లాంచ్​..
యాపిల్​ కొత్త మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​ లాంచ్​.. (Apple)

యాపిల్​ కొత్త మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​ లాంచ్​..

Apple MacBook Air M3 : యాపిల్ తన తాజా ఎం3 చిప్​తో కూడిన రెండు కొత్త మ్యాక్​బుక్ ఎయిర్ మోడళ్లను విడుదల చేసింది. వీటి పర్ఫార్మెన్స్​ మెరుగ్గా ఉంటుంది. రెండింటికీ డిస్​ప్లై స్క్రీన్​ సైజ్​ వేరువేరుగా ఉన్నాయి. ఒకటి 13 ఇంచ్​, ఇంకోటి 15 ఇంచ్​. వీటి ప్రారంభ ధర రూ. 1,14,900గా ఉంది. టీచర్స్​, స్టూడెంట్స్​కి డిస్కౌంట్​లో ఇవి.. రూ. 1,04,900- రూ. 1,24,900కి ప్రత్యేక్​ సేల్​ ఆఫర్స్​లో భాగంగా ఇస్తోంది దిగ్గజ్​ టెక్​ సంస్థ యాపిల్​.

పర్ఫార్మెన్స్​.. సూపర్​!

తాజా మ్యాక్​బుక్ ఎయిర్​ మెయిన్​ హైలైట్లలో ఒకటి.. దాని ఆకట్టుకునే పనితీరు, ప్రదర్శన. పాత ఎం1 వెర్షెన్​తో పోలిస్తే 60 శాతం వేగాన్ని పెంచింది! ఎం3 చిప్ అత్యంత వేగవంతమైన ఇంటెల్ ఆధారిత మ్యాక్​బుక్ ఎయిర్​ కూడా 13 ఫ్యాక్టర్​తో అధిగమిస్తుందని ఆపిల్ ధీమాగా చెబుతోంది. అప్​గ్రేడెడ్ న్యూరల్ ఇంజిన్​ను చేర్చడం వల్ల ల్యాప్​టాప్ సామర్థ్యంతో పాటు వేగాన్ని మరింత పెంచగలిగింది యాపిల్​. ఇది "AI పై అధికంగా వర్క్​ చేసే వారికి ది బెస్ట్​ ల్యాప్​టాప్​గా ఉంటుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

మ్యాక్​బుక్ ఎయిర్​ రెండూ 18 గంటల బ్యాటరీ లైఫ్​ని అందిస్తాయి. డ్యూయెల్​ ఎక్స్​టర్నల్​ డిస్​ప్లేలను సపోర్ట్​ చేస్తాయి.

Apple MacBook Air M3 price : ఎం3తో కూడిన కొత్త యాపిల్​ మ్యాక్​బుక్ ఎయిర్​ కొనుగోలు చేయాలనుకునే ఆసక్తిగల కొనుగోలుదారులు.. మార్చి 4 నుంచి ఆపిల్ ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ స్టోర్ల ద్వారా తమ ఆర్డర్లను బుక్​ చేసుకోవచ్చు. ఈ ల్యాప్​టాప్​ మార్చ్​ 8 నుంచి ఆపిల్ స్టోర్ లొకేషన్లు, ఆపిల్ అధీకృత రీసెల్లర్లలో లభ్యం అవుతుంది.

కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ఏవీ 1 డీకోడ్ ఇంజిన్​ను కొత్త మ్యాక్​బుక్ ఎయిర్​లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. స్ట్రీమింగ్ సేవల కోసం వినియోగదారులకు మెరుగైన వీడియో నాణ్యత, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇవి. వైఫై 6-ఈ సపోర్ట్​తో పాటు వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ మైక్రోఫోన్ మోడ్స్, ఆడియో, వీడియో కాల్స్ సమయంలో మెరుగైన వాయిస్ క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లను ఈ ల్యాప్​టాప్ లాంచ్​ అయ్యింది.

Apple MacBook Air M3 price in India : ఎం3 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కెమెరా ఫీచర్లను ఎనేబుల్ చేయడం, టెక్స్ట్ కు రియల్ టైమ్ స్పీచ్, అనువాదం, టెక్స్ట్ అంచనాలు దృశ్య అవగాహన వంటి కొన్ని మాక్ఓఎస్ ఫంక్షనాలిటీతో సహా నిర్దిష్ట ఏఐ మోడళ్ల కోసం ఈ మ్యాక్​బుక్​ ఎయిర్​ మోడల్స్​ని ఆప్టిమైజ్​ చేశారు.

తదుపరి వ్యాసం