Mutual fund SIP : పవర్ ఆఫ్ 'కాంపౌండింగ్'- నెలకు రూ. 10వేల సిప్‌తో కోట్ల సంపద మీ సొంతం!
24 March 2024, 11:45 IST
Franklin India Focused Equity Fund : కోటీశ్వరులవ్వాలని కలలు కంటున్నారా? అయితే మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలుసుకోవాల్సిందే! రూ. 10వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు.
నెలకు రూ. 10వేలతో కోట్ల సంపద.. ఈ ఫండ్‌తో సూపర్ రిటర్నులు!
Franklin India Focused Equity Fund : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్. కానీ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) చేయడానికి కూడా భయపడతారు. వీరందరు.. 'కాంపౌండింగ్'కి ఉన్న పవర్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. క్రమంక్రమంగా పెట్టుబడులు పెడుతూ వెళితే, భవిష్యత్తులో కోట్లల్లో సంపద సృష్టించుకోవచ్చని అర్థం చేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఓ ఉదాహరణతో అర్థం చేసుకుందాము! ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో మీరు నెలకి రూ. 10వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. కేవలం 16ఏళ్లలోపే మీరు కోటీశ్వరులు అయ్యేవారు.
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్..
2007 జులైలో లాంచ్ అయ్యింది ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి రిటర్నులు తెచ్చిపెట్టి, మదుపర్లను కోటీశ్వరులను చేసింది! దాదాపు 16ఏళ్ల వ్యవధిలో.. 14.33శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందింది ఈ ఫండ్. ఏడాది ముందు ఈ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ (మొత్తం రూ. 1.20లక్షలు) చేసి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1.46 లక్షలు అయ్యేది. అదే విధంగా.. మూడేళ్లుగా ఈ ఫండ్‌లో రూ. 10వేలు పెట్టుబడి చేస్తూ ఉంటే.. ఇన్వెస్టెట్ వాల్యూ రూ. 3.6లక్షలుగాను, మొత్తం వాల్యూ రూ. 4.96 లక్షలుగాను ఉండేది.
Mutual fund SIP explained in Telugu : ఐదేళ్లల పాటు నెలకు రూ. 10వేల సిప్‌తో రూ. 6 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌ని రూ. 10.26 లక్షలుగా మార్చింది ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ఫోక్స్డ్ ఈక్విటీ ఫండ్. అదే విధంగా.. 10ఏళ్ల పీరియడ్‌లో నెలకు రూ. 10వేలతో కూడిన రూ. 12 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌ని రూ. 36.47 లక్షలుగా మార్చింది.
ఇక 2007 జులై నుంచి ఇందులో క్రమం తప్పకుండా నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మీ రూ. 20 లక్షల పెట్టుబడి.. ఈపాటికి రూ. 97.58 లక్షలుగా చేసి ఉండేది.
పవర్ ఆఫ్ కాంపౌండింగ్..
ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్‌ని దృష్టి పెట్టి చేయాలి. అప్పుడే బ్యూటిఫుల్ రిటర్నులు వస్తాయి. టైమ్‌తో పాటు పెట్టుబడులు కూడా వృద్ధిచెందుతాయి. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు.. కాంపౌండింగ్కి ఉన్న పవర్‌ని విశ్వసిస్తారు.
Mutual fund SIP calculator : మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టండి. కోటీశ్వరులు అవ్వండి!