తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023 : రూ. 25వేల బడ్జెట్​తో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి బెస్ట్​..

Amazon Sale 2023 : రూ. 25వేల బడ్జెట్​తో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి బెస్ట్​..

Sharath Chitturi HT Telugu

21 October 2023, 9:45 IST

google News
  • Amazon Sale 2023 : రూ. 25వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. అమెజాన్​ సేల్​లో కొన్ని బెస్ట్​ గ్యాడ్జెట్స్​పై క్రేజీ ఆఫర్స్​ లభిస్తున్నాయి.

రూ. 25వేల బడ్జెట్​తో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి బెస్ట్​..
రూ. 25వేల బడ్జెట్​తో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి బెస్ట్​..

రూ. 25వేల బడ్జెట్​తో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలా? ఇవి బెస్ట్​..

Amazon Sale 2023 : కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ ముగిసిందని బాధపడుతున్నారా? అయితే మీరు బాధ పడాల్సిన అవసరం. అనేక స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ ఆఫర్స్​తో అమెజాన్​ సేల్​ తిరిగొచ్చింది. రూ. 25వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. వివరాల్లోకి వెళితే..

ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 లైట్​ 5జీ:- ఈ స్మార్ట్​ఫోన్​ వాస్తవ ధర రూ. 30905. కాగా.. అమెజాన్​ సేల్​లో దీనిని రూ. 21,998కే కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 108ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ అసిస్ట్​, 2ఎంపీ మాక్రో లెన్స్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

లావా అగ్ని 2 5జీ:- ఈ స్మార్ట్​ఫోన్​ వాస్తవ ధర రూ. 25,999. కాగా.. అమెజాన్​లో దీనిని ఇప్పుడు రూ. 19,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 50ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంటుంది. 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

Best smartphones under 25000 : ఐకూ జెడ్​7ఎస్​ 5జీ:- ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 23,999. కానీ అమెజాన్​ సేల్​ 2023లో దీనిని రూ. 16,999కే కొనుక్కోవచ్చు. ఇందులో 64ఎంపీ కెమెరా ఉంటుంది. 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

రియల్​మీ నార్జో 60 5జీ:- ఈ గ్యాడ్జెట్​ వాస్తవ ధర రూ. 19,999. కానీ అమెజాన్​లో దీనిని రూ. 16,499కే కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 64ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రంట్​ కెమెరాలు ఉంటాయి.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం14 5జీ:- దీని వాస్తవ ధర రూ. 18,990. అమెజాన్​ సేల్​లో ఈ మోడల్​ని రూ. 13,490కే కొనుక్కోవచ్చు. ఇందులో 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది.

ఐఫోన్​ కొనాలని ఉందా..?

iPhone 14 Plus price drop : మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వచ్చిన తరువాత అప్పటివరకు హాట్ కేక్స్​లా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్​తో లభిస్తున్నాయి. ఫ్లిప్​కార్ట్ సహా వివిధ ఈ కామర్స్ సైట్స్ వీటిపై పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ఐఫోన్ 14ను ఇప్పుడు ఫ్లిప్​కార్ట్​లో రూ. 73999లకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తక్షణ తగ్గింపు గరిష్టంగా రూ. 1500 వరకు ఉంటుంది. అంతేకాదు, అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 39,150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, మీ వద్ద ఉన్న ఫోన్ కు గరిష్ట ఎక్స్చేంజ్ మొత్తం లభిస్తే, మీరు ఐ ఫోన్ 14 ప్లస్ ను సుమారు రూ. 34 వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం