Amazon Sale 2023 : దీపావళికి.. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై క్రేజీ ఆఫర్స్!
11 November 2023, 6:14 IST
Amazon Sale 2023 : Amazon Sale 2023 : దీపావళికి.. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై అమెజాన్‌లో క్రేజీ ఆఫర్స్ లభిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
దీపావళికి.. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై క్రేజీ ఆఫర్స్!
Amazon Sale 2023 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌లో ఒకటి ఎంపిక చేసుకోవాలన్న ప్లాన్‌లో ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే! దీపావళి నేపథ్యంలో అమెజాన్‌లో వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌పై అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఆ వివరాలు..
ఈ వన్‌ప్లాస్ స్మార్ట్‌ఫోన్స్‌పై క్రేజీ ఆఫర్స్..
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ:- ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ 120 హెచ్‌జెడ్ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా సెటప్ ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 16జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ వంటివి ఇతర ఫీచర్స్‌గా ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ. 44,999గా ఉంది.
Discounts on OnePlus smartphones : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3:- ఈ వన్‌ప్లస్ గ్యాడ్జెట్లో 6.7 ఇంచ్ 120 హెచ్‌జెడ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 782జీ చిప్సెట్, 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ దీని సొంతం. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీ రేర్ కెమెరా సెటప్‌తో పాటు 16ఎంపీ ఫ్రెంట్ కెమెరాలు వస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్ ధర రూ. 26,999.
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ:- ఈ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ 120 హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ దీని సొంతం. 16జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్ రేర్ కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ధర రూ. 37,999గా ఉంది.
Discounts on OnePlus Nord CE 2 Lite : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్:- ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఇతర ఫీచర్స్‌గా ఉన్నాయి. 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్, 2ఎంపీ మాక్రో లెన్స్‌లు రేర్ కెమెరాగా వస్తున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ మోడల్ ధర రూ. 17,999.
వన్‌ప్లస్ 11 5జీ:- ఇందులో 6.7 ఇంచ్ అమోలెడ్ క్యూహెచ్డీ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రావైడ్, 32ఎంపీ టెలిస్కోపిక్ లెన్స్‌లతో కూడిన కెమెరా సెటప్ రేర్‌లో వస్తోంది. ఫ్రెంటలో 16ఎంపీ కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ దీని సొంతం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. ధర రూ. 56,999.