5G smartphones : ఇండియాలో.. ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Budget friendly 5G smartphones : బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని మీకోసం మేము రూపొందించాము. ఓ లుక్కేసేయండి…
Budget friendly 5G smartphones : కొత్తగా ఒక 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? కొనే మొబైల్.. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో లభిస్తున్న ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను ఇక్కడ చూడండి..
ట్రెండింగ్ వార్తలు
బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్..
సామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీ:- ఈ మొబైల్లో యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. 13 5జీ బ్యాండ్స్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా కనెక్టివిటీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇందులో ఎక్సినోస్ 1330 ఆక్టా కోర్ 2.4 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ ఉంటుంది. 6.6 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఇందులో ఉంటుంది. ఈ మొబైల్ ధర రూ. 18,990గా ఉంది.
Best 5G smartphones : రియల్మీ 11 ప్రో 5జీ:- రియల్మీ 11 ప్రో 5జీలో 120హెచ్‌జెడ్‌తో కూడిన కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 7050 5జీ చిప్సెట్ దీని సొంతం. 100ఎంపీ ప్రోలైట్ కెమెరా కూడా వస్తోంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. అంతేకాకుండా.. కేవలం 18 నిమిషాల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ని 50శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ. 26,999.
నోకియా జీ42 5జీ:- నోకియా జీ42 అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఆప్షన్. దీని ధర రూ. 16,499. ఇందులో స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ చిప్సెట్ ఉంటుంది. 11జీబీ ర్యామ్ వస్తోంది. 50ఎంపీ ట్రిపుల్ రేర్ ఏఐ కెమెరా సైతం లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
Redmi 12 5G price in India : రెడ్మీ 12 5జీ:- ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 50ఎంపీ ఏఐ డ్యూయెల్ రేర్ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 22.5వాట్ ఛార్జర్ వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 13పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. మార్కెట్లో ఈ రెడ్మీ 12 5జీ ధర రూ. 19,999గా ఉంది.
టాప్ 5 వివో స్మార్ట్‌ఫోన్స్..
అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో, ప్రీమియం లుక్స్‌తో వివో ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మీ ఆత్మీయులకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే, రూ. 25వేల లోపు ధరలో ఈ స్మార్ట్ ఫోన్స్‌ను పరిశీలించండి.
Best Vivo smartphones : వివో వై 27 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ+ 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఇది 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.64-అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.18999 కి కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం