తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival: 10 వేల రూపాయల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Amazon Great Indian Festival: 10 వేల రూపాయల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

10 November 2023, 16:16 IST

  • Smartphones under 10,000: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ దీపావళికి చవకైన ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే.. ఆమెజాన్ లోని ఈ ఆఫర్స్ ను చూడండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Samsung)

ప్రతీకాత్మక చిత్రం

Smartphones under 10,000: దీపావళి (diwali 2023) వచ్చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇది మంచి సమయం. ఈ పండుగ సీజన్‌లో అమెజాన్ (amazon) స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌సెట్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంకుల నుండి అదనపు డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్‌లతో, రూ. 10 వేల లోపు ధరలో వివిధ స్మార్ట్‌ఫోన్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.

Redmi A2: రెడ్ మి ఏ 2

ప్రస్తుతం దీని ధర రూ. 5,299. ఈ ఫోన్ 6.52-అంగుళాల స్క్రీన్‌ను 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో వస్తోంది. ఇందులో మీడియా టెక్ హీలియో జీ 36 ప్రాసెసర్ ఉంది. 4 జీబీ ర్యామ్ ను 3GB వర్చువల్ ర్యామ్ తో కలిపి 7 జీబీ ర్యామ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇందులో 64 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఇందులో 8MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 5000mAh బ్యాటరీ తో వస్తోంది.

Itel P55: ఐటెల్ పీ 55

ఆమెజాన్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 కు లభిస్తుంది. ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో రన్ అవుతోంది. ఇందులో 6 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. అలాగే, 50MP AI డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా సెటప్ ఇందులో ఉంది. Android 13 వెర్షన్‌లో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.

Samsung Galaxy M13: సామ్సంగ్ గెలాక్సీ ఎం 13

ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ. 9,228కి లభిస్తుంది. Samsung Galaxy M13 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. Exynos 850 SoC పై ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అంటే, 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6000 mAh బ్యాటరీని అమర్చారు.

Realme Narzo N53: రియల్ మి నార్జో ఎన్ 53

ఆమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 7,999కి లభిస్తుంది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. Unisoc T612 చిప్‌సెట్‌తో ఇది పని చేస్తుంది. ఇందులో 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. ఈ ఫోన్ 33 సూపర్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mAh బ్యాటరీతో వస్తోంది. ఇందులో 50MP AI ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలను అమర్చారు.

Redmi 12C: రెడి మి 12 సీ

ఆమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 6,799కి లభిస్తుంది. స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్, ఓలియోఫోబిక్ కోటింగ్‌తో 6.71-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఈ స్మార్ట్‌ఫోన్ 500 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ ను అందిస్తుంది. 5000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, గేమింగ్ కోసం 1 GHz GPU లను ఇందులో అమర్చారు. 50MP డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాల సెటప్ ఇందులో ఉంది. ఫోన్‌లో 4GB RAM, 3GB వర్చువల్ RAMలతో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం