4G smartphones : ఇండియాలో.. ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్..
Budget friendly 4G smartphones : బడ్జెట్లో మంచి 4జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇవి ది బెస్ట్..!
Budget friendly 4G smartphones : ఈ దీపావళికి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో.. అందుబాటులో ఉన్న టాప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్స్..
సామ్సంగ్ గెలాక్సీ ఏ50ఎస్:- ఈ సామ్సంగ్ గ్యాడ్జెట్ ధర రూ. 19,999. ఇందులో ఎక్సినోస్ 9 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 48ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి లభిస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్ ధర రూ. 19,999.
Best 4G smartphones in India : ఒప్పో ఎఫ్21 ప్రో:- ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ దీని సొంతం. 64ఎంపీ ప్రైమరీ, 2+2ఎంపీ రేర్ కెమెరా, 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఈ గ్యాడ్జెట్లో ఉంటుంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఈ మోడల్ ధర రూ. 18,750.
రెడ్మీ నోట్ 11 ప్రో:- ఈ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రోలో మీడియాటెక్ హీలియో జీ96 ఆక్టా కోర్ చిప్సెట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ దీని సొంతం. 108ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఇందులో ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఈ మొబైల్ ధర రూ. 18,370గా ఉంది.
ఇదీ చూడండి:- 5G smartphones : ఇండియాలో.. ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
మోటో జీ72:- మోటోరోలా నుంచి వచ్చిన మోటో జీ72కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ మోడల్ ధర రూ. 17,990. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ఆక్టా కోర్ చిప్సెట్, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 108ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
Vivo S1 price in India : వివో ఎస్1:- ఈ వివో మొబైల్లో మీడియాటెక్ హీలియో పీ65 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తోంది. 16+8+2 ఎంపీ రేర్, 32ఎంపీ ఫ్రెంట్ కెమెరాలు వస్తున్నాయి. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 17,200.
సామ్సంగ్ గెలాక్సీ ఏ23:- ఈ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,499. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వంటివి ఉంటాయి. 8జీబీ ఫ్రెంట్ కెమెరాతో పాటు 50ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెర్ సెటప్ ఇందులో ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
సంబంధిత కథనం