Kia EV5 electric car : ఇదిగో కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. అదిరే డిజైన్‌తో!
25 August 2023, 12:45 IST
- Kia EV5 electric car : మచ్ అవైటెడ్ కియా ఈవీ5ని అఫీషియల్‌గా రివీల్ చేసింది కియా మోటార్స్. చైనాలో జరిగిన ఓ ఈవెంట్లో ఈ కారును ప్రదర్శించింది.
ఇదిగో కియా ఈవీ5 ఎలక్ట్రిక్ కారు..
Kia EV5 electric car : ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరో అస్త్రాన్ని ప్రయోగించింది సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. మచ్ అవైటెడ్ కియా ఈవీ5 ఎలక్ట్రిక్ కారును అఫీషియల్‌గా ఆవిష్కరించింది. చైనాలో జరుగుతున్న చెంగ్డూ మోటార్ షోలో ఈ 5 సీటర్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ ఈవీ విశేషాలపై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా ఈవీ5.. అదిరిపోయిందిగా..!
ఈ మిడ్-సైజ్ ప్రీమియం ఈవీ ఫ్రెంట్లో ఉన్న టైగర్ నోస్ గ్రిల్, కింక్డ్ రేర్ బెల్ట్‌లైన్, ఆలాయ్ వీల్స్‌కు వస్తున్న యాంగ్యులర్ డిజైన్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. రేర్ వింగ్‌లో ఎయిరోడైనమిక్ ఎఫీషియెన్స్ మెరుగుపరిచే విధంగా డిజైన్ ఉండటం విశేషం.
Kia EV5 price : ఇక కియా ఈవీ5 కేబిన్ విషయానికొస్తే.. ఇందులో ఉన్న డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్లు.. ఈవీ9తో పోలి ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌పై చాలా బటన్స్ ఉన్నాయి. కార్ ఫంక్షనింగ్ని వీటితో కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇక ఈ మోడల్ తొలుత చైనాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత యూరోప్, అమెరికా మర్కెట్లోకి అడుగుపెడుతుందని సమాచారం. ఇండియాలో లాంచ్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు.
ఇదీ చూడండి:- Toyota Rumion vs Kia Carens : రుమియన్ వర్సెస్ క్యారెన్స్.. ఏది బెస్ట్?
కాగా.. అంతర్జాతీయంగా, ఈ కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. స్కోడా ఎన్యాక్యూ, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూబీ, ఫిస్కర్ ఓషన్ వంటి ఈవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Kia EV5 price in India : ఈవీ6, ఈవీ9తో కియా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే బలంగా ఉంది. ఇక ఈవీ5 ఎంట్రీతో ఇది మరింత శక్తివంతంగా మారుతుంది.
కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కియా మోటార్స్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఈ మోడల్‌పై కస్టమర్లలో చాలా కాలంగా ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఈవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
కియా ఈవీ6 లిమిటెడ్ ఎడిషన్..
Kia EV6 limited edition : కియా ఈవీ6కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌కు ప్రతిష్ఠాత్మక 2023 నార్త్ అమెరికన్ కార్, ట్రక్, యుటిలిటీ వెహికిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఈ ఈవీకి లిమిటెడ్ ఎడిషన్ వర్షెన్‌ను తీసుకొచ్చింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.