Toyota Rumion vs Kia Carens : రుమియన్ వర్సెస్ క్యారెన్స్.. ఏది బెస్ట్?
Toyota Rumion vs Kia Carens : టయోటా రుమియన్ వర్సెస్ కియా క్యారెన్స్. ఈ రెండు ఎంపీవీల్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
Toyota Rumion vs Kia Carens : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో అటు ఎస్యూవీ సెగ్మెంట్‌తో పాటు ఎంపీవీ విభాగంలోనూ పోటీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాంచ్ చేస్తున్న సంస్థలు.. కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. తాజాగా.. ఈ జాబితాలోకి టయోటా రుమియన్ చేరింది! ఈ మోడల్‌ను ఇటీవలే ఆవిష్కరించింది టయోటా సంస్థ. త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది.. కియా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న క్యారెన్స్ ఎంపీవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ ఎంపీవీల డైమెన్షన్స్ వివరాలివే..
మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ రుమియన్‌ను రూపొందించింది టయోటా సంస్థ. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ సరౌండెడ్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, రిమోట్ ఫోల్టింగ్ ఫంక్షన్‌తో కూడిన బాడీ కలర్డ్ ఓఆర్వీఎంలు, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
టయోటా కొత్త ఎంపీవీ పొడవు 4,420ఎంఎం. వెడల్పు 1,735ఎంఎం. ఎత్తు 1,690ఎంఎం. వీల్‌బేస్ 2,740ఎంఎం.
Toyota Rumion on road price Hyderabad : మరోవైపు కియా క్యారెన్స్‌లో స్కల్ప్టెడ్ హుడ్, స్లీక్ గ్రిల్ డిజైన్, ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్స్, సిల్వర్డ్ రూఫ్ రెయిల్స్, క్రోమ్ లింక్డ్ విండోలు, కనెక్టెడ్ స్టైల్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, బ్లాక్డ్ ఔట్ క్లాడింగ్, 16 ఇంచ్ డైమెండ్ కట్ లాయ్ వీల్స్ వస్తున్నాయి.
క్యారెన్స్ ఎంపీవీ పొడవు 4,540ఎంఎం. వెడల్పు 1,800ఎంఎం. ఎత్తు 1,708ఎంఎం. వీల్‌బేస్ 2,780ఎంఎం.
ఈ రెండు ఎంపీవీ ఫీచర్స్ ఇవే..
రుమియన్ ఎంపీవీ 7 సీటర్ కేబిన్‌లో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి.
ఇక క్యారెన్స్‌లో 6 సీట్, 7సీట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కారు కేబిన్‌లో ప్రీమియం లెథరెట్ అప్ హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, పానారోమిక్ సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ వంటివి లభిస్తున్నాయి.
ఈ రెండింటి ఇంజిన్ ఆప్షన్ వివరాలు..
టయోటో కొత్త కారులో 1.5 లీటర్, డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ (మైల్డ్ హైబ్రీడ్) ఉంటుంది. ఇది 103 హెచ్‌పీ పవర్‌ను ,136.8 ఎన్ఎంట్ టర్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక సీఎన్జీ వేరియంట్.. 87 హెచ్‌పీ పవర్‌ను, 121 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం.
ఇక కియా క్యారెన్స్‌లో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (140 హెచ్‌పీ పవర్- 242 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ పెట్రోల్ (115 హెచ్‌పీ పవర్- 144 ఎన్ఎం టర్క్), 1.5 లీటర్ టర్బో డీజిల్ (113.4 హెచ్‌పీ పవర్- 250 ఎన్ఎం టార్క్) ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 6 స్పీడ్ మేన్యువల్/ ఆటోమెటిక్తో పటు 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ లభిస్తోంది.
వీటి ధరల వివరాలివే..
Kia Carens on road price Hyderabad : టయోటా రుమియన్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు కియా క్యారెన్స్ ఎంపీవీ ఎక్స్‌షోరూం ధర రూ. 10.45లక్షలు- రూ. 18.9లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం