Adani debt exposure to banks : భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్ ఎంత అప్పు ఉంది?
29 January 2023, 11:55 IST
Adani debt exposure to banks : వ్యాపార ప్రపంచంలో అదానీ గ్రూప్‌పైనే ఇప్పుడు చర్చంతా! హిన్డెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌పై ఫోకస్ పడింది. ఈ క్రమంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకీ.. భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్ ఎంత అప్పు ఉంది?
బ్యాంకులకు అదానీ ఎంత అప్పు ఉన్నారు?
Adani debt exposure to Indian banks : అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న హిన్డెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక.. వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదానీ స్టాక్స్ భారీగా పతమయ్యాయి. మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ వార్తల మధ్య.. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అదానీతో దేశీయ బ్యాంకలకు ఎంత ముప్పు పొంచి ఉందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి.. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు సానుకూల సమాధానం ఇస్తున్నాయి. దేశీయ బ్యాంకుల ద్వారా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలు తక్కువేనని, అవి 'మేనేజెబుల్ లిమిట్స్'లోనే ఉన్నాయని జెఫ్రీస్, సీఎల్ఎస్ఏ పేర్కొన్నాయి.
అదానీ గ్రూప్ అప్పులు..
అదానీ గ్రూప్ తీసుకున్న అప్పులు.. గత మూడేళ్లల్లో రెట్టింపు అయ్యాయి. రూ. 1లక్ష కోట్ల నుంచి రూ. 2లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు 25శాతం పెరిగాయని సీఎల్ఎస్ఏ వెల్లడించింది. మొత్తం మీద.. అదానీ అప్పుల్లో ఇండియన్ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉందని వివరించింది.
Adani debt exposure to banks : "అదానీ గ్రూప్ రుణాల్లో భారత దేశ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉంది. అందులో ప్రైవేటు బ్యాంకుల వాటా 10శాతం కన్నా తక్కువ. ఎయిర్పోర్ట్, పోర్ట్ వంటి ఫైనాన్సియల్ అసెట్స్‌తో కూడిన వ్యాపారలకే అధికంగా రుణాలు ఇచ్చినట్టు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు చెబుతున్నాయి. అందువల్ల.. బ్యాంకింగ్ వ్యవస్థపై అదానీ అప్పుల ప్రభావం తక్కువే," అని సీఎల్ఎస్ఏ పేర్కొంది.
పీఎస్‌యూ బ్యాంక్‌లపై అదానీ అప్పుల ప్రభావం 30శాతంగా ఉంది. కానీ గత ముడేళ్లల్లో ఈ అప్పులు పెద్దగా పెరగలేదు. అంటే.. అదానీ కొత్త, పాత వ్యాపారాలకు విదేశాల నుంచే ఎక్కువగా నిధులు అందాయని సీఎల్ఎస్ఏ వివరించింది.
Hindenburg report on Adani group : అదానీ గ్రూప్ అప్పుల్లో భారత దేశ బ్యాంక్‌ల వాటా తగ్గుతూ వస్తోందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. గత మూడేళ్లల్లో అదానీ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రూ. 1లక్ష కోట్ల అప్పుల్లో ఇండియన్ బ్యాంక్స్ వాటా రూ. 15వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఏసీసీ, అంబుజా వంటి సంస్థల కొనుగోళ్ల కోసం.. అదానీ బృందం విదేశీల నుంచే ఎక్కువగా డబ్బులు తెచ్చుకుందని పేర్కొంది.
'మేనేజ్ చేసేయొచ్చు..!'
భారత దేశంలోని బ్యాంకులు ఇచ్చిన అన్ని అప్పులతో పోల్చి చూస్తే.. అదానీ గ్రూప్ వాటా 0.5శాతంగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ వెల్లడించింది. ఇందులో.. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ వాటా 0.7శాతం, ప్రైవేట్ సెక్టార్ వాటా 0.3శాతం అని పేర్కొంది.
Adani stocks crash : "అదానీ గ్రూప్ కంపెనీల కన్సాలిడేటెడ్ గ్రాస్ డెట్ రూ. 1.9 ట్రిలియన్గాను, నెట్ డెట్ రూ. 1.6 ట్రిలియన్గాను ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ పోర్ట్స్ వ్యాపారాల్లోనే అత్యధిక అప్పులు ఉన్నాయి. వీటిల్లో నెట్ డెట్ రూ. 300- రూ. 400 బిలియన్గా ఉంది. కానీ ఈ కంపెనీల క్యాష్‌ఫ్లో మెరుగ్గానే ఉంది," అని జెఫ్రీస్ స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్‌తో వచ్చే ముప్పుపై ప్రభుత్వ ఆధారిత బ్యాంకులు ఇప్పటికే స్పందించాలి. ఆర్బీఐ పెట్టిన లిమిట్‌లోనే.. తాము అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చామని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వివరించాయి.
నివేదికలో ఏముంది..?
Adani on Hindenburg's report : అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి.. ఓ సంచలన నివేదికను బయటపెట్టింది అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ హిన్డెన్బర్గ్ రీసెర్చ్. అదానీ గ్రూప్‌లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వివరించింది. అంతా బాగానే ఉందని బయట ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేసిందని వివరించింది. ఫలితంగా.. అదానీ గ్రూప్ స్టాక్స్‌పై తాము షార్ట్- సెల్లింగ్వైపు ఉంటామని స్పష్టం చేసింది.
ఫలితంగా.. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో.. శుక్రవారం ఒక్క రోజే మదుపర్లు రూ. 3.9 ట్రిలియన్ పోగొట్టుకోగా.. బుధవారాన్ని కూడా కలుపుకుంటే.. ఆ సంఖ్య రూ. 4.4 ట్రిలియన్కు చేరుతుంది!