Stocks to buy today : స్టాక్స్ టు బై- ఎయిర్టెల్ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : రిపబ్లిక్ డే కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెలవు తీసుకున్నాయి. అయితే.. బుధవారం ట్రేడింగ్ సెషన్లో మాత్రం సూచీలు భారీగా పడ్డాయి. 226 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 60,205 వద్ద ముగిసింది. ఇక 226 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద స్థిరపడింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1,085 పాయింట్లు కోల్పోయి 41,647 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం.. గత కొంత కాలంగా నష్టాలు, రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్ వీక్‌గా కనిపిస్తోంది. నిఫ్టీకి.. 17,750 కీలక సపోర్ట్‌గా ఉంది.
Stock market news today : "నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా మారింది. పుల్ బ్యాక్ వచ్చినా.. దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది. 17,750 కీలక సపోర్ట్‌గా ఉంది. అది కూడా బ్రేక్ అయితే.. నిఫ్టీ మరింత కిందకి పడొచ్చు. 17,780- 17,800 లెవల్స్పైనా ట్రేడర్లు ఫోకస్ చేయాలి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 45 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.
US Stock market investment : అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.61శాతం, ఎస్ అండ్ పీ 500 1.1శాతం, నాస్డాక్ 1.76శాతం లాభాల్లో ముగిశాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stocks to buy list : బుధవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు రూ. 2393.94కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1378.49కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై..
హీరో మోటోకార్ప్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2725, టార్గెట్ రూ. 2850- రూ. 2900
Bharti Airtel share price target : భారతీ ఎయిర్టెల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 760, టార్గెట్ రూ. 790- రూ. 800
Tata Steel share price target : టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 114, టార్గెట్ రూ. 130
ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 147, టార్గెట్ రూ. 163
(గమనిక:- ఇవి నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. ఇది సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం