2024 Renault Duster : సూపర్ లుక్స్‌తో రెనాల్ట్ డస్టర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
30 November 2023, 11:30 IST
- 2024 Renault Duster : 2024 రెనాల్ట్ డస్టర్‌ని అంతర్జాతీయంగా రివీల్ చేసింది సంస్థ. ఆ వివరాలు..
సూపర్ లుక్స్‌తో రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ..
Renault Duster 2024 : రెనాల్ట్ డస్టర్‌ని అధికారికంగా రివీల్ చేసింది ఆటోమొబైల్ సంస్థ. ఈ ఎస్యూవీ లుక్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్ కూడా ఈ వెహికిల్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎస్యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ..
2024 రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ ఫ్రెంట్, రేర్‌లో వై-షేప్ లైటింగ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఫ్రెంట్లో స్కల్ప్టెడ్ బానెట్ వస్తోంది. ఫుల్ విడ్ గ్రిల్ విత్ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, సూపర్ డీజైన్తో లోగో ఇందులో ఉన్నాయి. బంపర్ మీద వర్టికల్ ఎయిర్ వెంట్స్, సర్క్యులర్ ఫాగ్ లాంప్ హౌజింగ్, లోయర్ గ్రిల్ కోసం యునీక్ బుల్ బార్ డిజైన్ వంటివి ఫిక్స్ చేసింది రెనాల్ట్. స్క్వేర్డ్ వీల్ ఆర్చీస్, బ్లాక్డ్ ఔట్ అలాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ వంటివి రేర్‌లో వస్తున్నాయి.
Renault Duster 2024 India launch : ఇక ఈ 2024 రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. అవి.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మొదటి ఇంజిన్ 120 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. రెండు, మూడు ఇంజిన్లు.. 140 హెచ్‌పీ, 170 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తాయి. మూడో ఇంజిన్ని ఇథనాల్ మిక్స్ ఫ్యూయెల్‌తో కూడా వినియోగించుకోవచ్చని రెనాల్ట్ చెబుతోంది.
ప్రస్తుతం ఉన్నది 5 సీటర్ డస్టర్. కాగా.. 7-సీటర్ డస్టర్‌ని కూడా తయారు చేసే ప్లాన్‌లో ఉన్నట్టు రెనాల్ట్ తెలిపింది.
ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?
భారతీయులకు రెనాల్ట్ డస్టర్ అంటే ఒక ఎమోషన్! ఇండియాలో లాంచ్ అయిన తొలి ఎస్యూవీ ఇదే! అప్పట్లో ఈ మోడల్‌కి మంచి డిమాండ్ కనిపించింది. కానీ పోటీ తట్టుకోలేక, సేల్స్ తగ్గిపోయాయి. చివరికి, ఈ ఎస్‌యూవీని ఇండియా మార్కెట్ నుంచి డిస్కంటిన్యూ చేసింది రెనాల్ట్.
Renault Duster 2024 price : ఈ మోడల్ని ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు? అన్న విషయంపై రెనాల్ట్ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2025 నాటికి ఈ ఎస్యూవీ.. ఇండియా రోడ్లపై కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ఇండియా ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే బీభత్సమైన పోటీ ఉంది. ఇక ఇప్పుడు.. ఈ డస్టర్ ఎస్యూవీ.. హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి కొన్ని బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌కి గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. మరి ఈసారి.. పోటీని తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి!