తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Cng Car : మైలేజ్​లో ఈ సీఎన్జీ కారు తోపు! చాలా డబ్బులు సేవ్​ చేయొచ్చు..

Best CNG car : మైలేజ్​లో ఈ సీఎన్జీ కారు తోపు! చాలా డబ్బులు సేవ్​ చేయొచ్చు..

Sharath Chitturi HT Telugu

22 December 2024, 13:05 IST

google News
    • New Maruti Suzuki Dzire CNG : 2024 మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీపై కీలక అప్డేట్​! ఈ మోడల్​ డీలర్​షిప్ షోరూమ్స్​కి చేరుకుంది. ఇక ఈ సీఎన్జీ సెడాన్​ మైలేజ్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీ ఇదిగో..
సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీ ఇదిగో..

సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీ ఇదిగో..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కాంపాక్ట్​ సెడాన్​లలో ఒకటైన మారుతీ సుజుకీ డిజైర్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ ఇటీవలే లాంచ్​ అయిన విషయం తెలిసిందే. ఫోర్త్​ జనరేషన్​ మారుతీ సుజుకీ డిజైర్ ప్రారంభ ధర రూ .6.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక ఇప్పుడు కొత్త డిజైర్​ పెట్రోల్​-సీఎన్జీ సెడాన్​ని కూడా సంస్థ తీసుకొస్తోంది. ఈ మోడల్​ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్​షిప్​ షోరూమ్స్​కి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీ- ధర..

మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ట్రిమ్ ఆప్షన్లలో లభిస్తుంది. సబ్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వర్షెన్ ప్రారంభ ధర రూ .8.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశంలో సాలిడ్​ సీఎన్జీ పోర్ట్​ఫోలియో ఉన్న సంస్థ మారుతీ సుజుకీ. హ్యుందాయ్​, టాటా మోటార్స్​ సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ: మైలేజ్​..

2024 మారుతీ సుజుకీ డిజైర్ పెట్రోల్ మోడల్​లో 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3 సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​, ఏఎంటీ ట్రాన్స్​మిషన్​​ ఆప్షన్స్​తో లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 5,700 ఆర్​పీఎం వద్ద 69 బీహెచ్​పీ పీక్​ పవర్​, 2,900 ఆర్​పీఎం వద్ద 102 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. పెట్రోల్-సీఎన్జీ వర్షెన్ కిలోకు 33.73 కిలోమీటర్ల మైలేజ్​ని ఇస్తుంది! డిజైర్ సీఎన్జీ 37-లీటర్ పెట్రోల్ ట్యాంక్, 55-లీటర్ల సామర్థ్యం గల సీఎన్జీ ట్యాంక్​తో వస్తుంది.

మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ- ఫీచర్లు..

2024 మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ మోడల్ వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వర్షెన్​లో ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్​ఈడీ టెయిల్​లైట్లు, పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, హైట్ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు, టీపీఎంఎస్, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, స్మార్ట్ కీ మొదలైనవి ఉన్నాయి.

ఇక ఈ సెడాన్​లో 6 ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ కెమెరాలు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త మారుతీ సుజుకీ డిజైర్​ సీఎన్జీపై సంస్థ భారీ ఆశలు పెట్టుకుంది. పోటీ విపరీతంగా పెరుగుతున్న సీఎన్జీ సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు డిజైర్​ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.

మారుతీ సుజుకీ తొలి ఈవీ..

మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్​ కారు అయిన ఈ విటారాకు సంబంధించిన కీలక అప్డేట్​! ఈ ఈవీ ప్రొడక్షన్ వర్షెన్​ని.. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో ప్రదర్శించనున్నారు. సుజుకీ ఈ విటారా మిలాన్​లో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్​లో మొట్టమొదటిసారి గ్లోబల్ అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఈవీఎక్స్​గా పిలిచిన ఈ మారుతీ సుజుకీ ఈ విటారాను 2025 మధ్య నాటికి భారత మార్కెట్​లో సంస్థ విడుదల చేస్తుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం