Bajaj CNG Bike : బజాజ్ సీఎన్జీ బైక్ మీద సూపర్ ఆఫర్.. ధర తగ్గింపు.. కొనేందుకు మంచి ఛాన్స్!
Bajaj CNG Bike Price Cut : బజాజ్ సీఎన్జీ బైక్ మీద భారీ తగ్గింపు లభిస్తోంది. పెట్రోల్, సీఎన్జీతో నడిచే ఈ బైక్‌పై సుమారు పది వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆ వివరాలేంటో చూద్దాం..
బజాజ్ ఆటో కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను భారత్‌లో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పరిచయం చేశారు. ఈ హైబ్రిడ్ బైక్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయి. ఇవి సీఎన్‌జీ 2 కిలోలు, పెట్రోల్ కోసం 2 లీటర్లు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బైక్‌ను రూపొందించారు. ఈ బైక్ విక్రయాలను పెంచేందుకు కంపెనీ ధరను తగ్గించినట్టుగా ప్రకటించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బజాజ్ ఈ బైక్‌ని విడుదల చేసిన ఆరు నెలల అవుతుంది. ఇప్పుడు తాజాగా బైక్ మీద తగ్గింపును ప్రకటించారు. ఇది కొనుగోలుదారులకు అందుబాటు ధరలో వస్తుంది. అసలు డ్రమ్ వేరియంట్ (బేస్ వేరియంట్) ఇప్పుడు రూ. 89,997 (ఎక్స్-షోరూమ్) వద్ద రూ. 5,000 తగ్గింపు తర్వాత అందుబాటులో ఉంటుంది.
మీడియం డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్(మిడ్ వేరియంట్) రూ. 10,000 తగ్గింపుతో రూ. 95,002 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. టాప్ స్పెక్ డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధర రూ. 1.10 లక్షలుగా ఉంటుంది. దీనికి ధర తగ్గింపు లేదు. మార్కెట్‌లో ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ అమ్మకాలను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
అధిక మైలేజ్, ఆధునిక ఫీచర్లతో కూడిన బైక్‌ను కొనుగోలు చేసేందుకు చూస్తుంటే.. బజాజ్ సీఎన్‌జీ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు ఇతర పెట్రోల్‌తో నడిచే బైక్‌లతో పోలిస్తే ఇది అధిక మైలేజీని, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఉంటుంది. ఇది డిజైన్‌లో స్పోర్టీ లుక్‌తో వస్తుంది.
కిలో సీఎన్జీతో 102 కి.మీ, లీటర్ పెట్రోల్‌తో 65 కి.మీ మైలేజీని ఇస్తుంది. అంటే రెండు ట్యాంక్‌లపై దాదాపు 330 కి.మీ వరకు మైలేజీని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. బైక్‌లో సీఎన్‌జీ అయిపోతే పెట్రోల్‌ను సహాయక ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఈ బైక్ సీఎన్జీలో 200 కి.మీ మైలేజీతో ఉంటుంది. 2 లీటర్ల పెట్రోలుతో 130 కి.మీ మైలేజీని పొందవచ్చు.
గమనిక : కంపెనీ అందించే డిస్కౌంట్‌ల గురించి తెలుసుకోవాలంటే సమీప డిలర్‌షిప్‌ను సంప్రదించండి. పైన చెప్పిన కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం.