తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Alcazar Facelift : స్టైలిష్​గా హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​.. బుకింగ్స్​ షురూ

Hyundai Alcazar facelift : స్టైలిష్​గా హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​.. బుకింగ్స్​ షురూ

Sharath Chitturi HT Telugu

23 August 2024, 7:20 IST

google News
    • Hyundai Alcazar facelift launch date 2024 హ్యుందాయ్ అల్కజార్ ఫేస్​లిఫ్ట్ ఎస్​యూవీ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ ఎస్​యూవీని సంస్థ తాజాగా రివీల్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఇదిగో హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​..
ఇదిగో హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​..

ఇదిగో హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​..

హ్యుందాయ్​ అల్కజార్​ ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​ త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టబోతోంది. ఇక ఇప్పుడు ఈ మోడల్​ని అధికారికంగా రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. కార్ల తయారీ సంస్థ తన ఫ్లాగ్​షిప్​ 3-రో ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​ వెర్షన్ మూడు చిత్రాలను తాజాగా విడుదల చేసింది. 2024 అల్కజార్ ఎస్​యూవీ సెప్టెంబర్ 9న భారతదేశంలో లాంచ్​కానుంది. కాగా బుకింగ్స్​ మాత్రమే ఇప్పుటికే మొదలైపోయాయి. ఆన్​లైన్​ ప్లాట్ఫామ్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్​షిప్​షోరూమ్స్​ ద్వారా రూ .25,000 చెల్లించి ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కొత్త క్రెటాను ప్రవేశపెట్టిన తరువాత కొరియా ఆటో దిగ్గజం నుంచి ఇది రెండొవ పెద్ద లాంచ్.

హ్యుందాయ్ తన మొదటి 3-రో ఎస్​యూవీని 2022లో భారతదేశంలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి, కొరియా కార్ల తయారీదారు ఈ మోడల్​కి సంబంధించిన 75,000 యూనిట్లను విక్రయించింది. ఆరు సీట్లు, ఏడు సీట్ల లేఅవుట్లతో సహా రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లలో ఇది అందుబాటులో ఉంది. మహీంద్రా ఎక్స్​యూవీ 700, టాటా సఫారీ వంటి మూడు వరుస యుటిలిటీ వాహనాలకు ఆల్కజార్ గట్టి పోటీ ఇస్తుంది.

హ్యుందాయ్ ఆల్కజార్ ఫేస్​లిఫ్ట్: వేరియంట్లు..

హ్యుందాయ్ మోటార్ కొత్త అల్కజార్ ఎస్​యూవీ ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్​యూవీని నాన్ ఎక్స్​టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించనున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది. వీటిలో రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్ అనే కొత్త కలర్ థీమ్ కూడా ఉంటుంది.

హ్యుందాయ్ అల్కజార్ ఫేస్​లిఫ్ట్: డిజైన్ మార్పులు…

హ్యుందాయ్ అల్కజార్ ఎస్​యూవీ కొత్త అవతారంలో కొత్త తరం క్రెటా నుంచి అనేక విధాలుగా ప్రేరణ పొందింది. ముందు భాగంలో, కొత్త అల్కజార్ కొత్త సెట్ హెచ్-ఆకారంలో ఉన్న ఎల్​ఈడీ డీఆర్ఎల్స్​, క్వాడ్ బీమ్ ఎల్​ఈడీ హెడ్​లైట్​ యూనిట్లతో వస్తుంది. అప్​డేటెడ్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లతో ఫ్రంట్ ఫేస్ ఇప్పుడు మరింత బోల్డ్​గా మారింది. సైడ్​లలో కూడా, హ్యుందాయ్ సరికొత్త క్యారెక్టర్ లైన్లతో ఎస్​యూవీకి మరింత బలాన్ని జోడించింది. ఈ ఎస్​యూవీ 18 ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్​తో వస్తుంది. వెనుక భాగంలో, అల్కజార్ కొత్త సెట్ ఎల్​ఈడీ కనెక్టెడ్ టెయిల్​లైట్ యూనిట్లు, కొత్త టెయిల్​గేట్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్​తో కొత్త స్పాయిలర్, అప్​డేటెడ్​ బంపర్- స్కిడ్ ప్లేట్​ని పొందుతుంది.

హ్యుందాయ్ అల్కజార్ ఫేస్​లిఫ్ట్: ఫీచర్లు..

హ్యుందాయ్ ఆల్కజార్​ ఫేస్​లిఫ్ట్​లో కొత్త ఫీచర్స్​ వచ్చాయి. ఈ ఎస్​యూవీలో 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉంటాయని కార్ల తయారీ సంస్థ తెలిపింది. అల్కజార్ ఫేస్​లిఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త తరం క్రెటాలో అదే ఇన్ఫోటైన్​మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లేను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, సీట్ వెంటిలేషన్ తదితర ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

అల్కజార్ ఎస్​యూవీ అనేక అధునాతన భద్రతా ఫీచర్లతో వస్తుంది. వీటిలో 40 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు సహా మొత్తంగా 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. హ్యుందాయ్ కొత్త క్రెటాతో లాంచ్ చేసిన లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.

హ్యుందాయ్ అల్కజార్ ఫేస్​లిఫ్ట్: ఇంజిన్

హ్యుందాయ్ కొత్త అల్కజార్​ను మల్టీ గేర్ బాక్స్ ఆప్షన్​లతో రెండు ఇంజిన్ ఆప్షన్​తో అందిస్తుంది. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్​మిషన్ (డీసీటీ) యూనిట్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది గరిష్టంగా 158బీహెచ్​పీ పవర్, 253ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను జనరేట్​ చేస్తుంది. 1.5-లీటర్ యూ2 సీఆర్డిఐ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో వస్తుంది. ఇది 113బీహెచ్​పీ పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్ ఫేస్​లిఫ్ట్: ధర..

హ్యుందాయ్ ప్రస్తుతం అల్కజార్ ఎస్​యూవీని రూ .16.77 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. టాప్-స్పెక్ సిగ్నేచర్ (ఓ) సెవెన్-సీటర్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ కోసం రూ .21.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఫేస్​లిఫ్ట్ వర్షెన్ లాంచ్ అయినప్పుడు ఎస్​యూవీ ధర కనీసం రూ.50,000 వరకు ఎక్కువ ఉంటుందని అంచనా.

తదుపరి వ్యాసం