తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Safari Vs Hyundai Alcazar : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొంటే బెస్ట్​?

Tata Safari vs Hyundai Alcazar : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొంటే బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

23 October 2023, 12:45 IST

    • Tata Safari vs Hyundai Alcazar : టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ హ్యుందాయ్​ అల్కజార్​.. ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొనాలి? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొంటే బెస్ట్​?
ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొంటే బెస్ట్​?

ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొంటే బెస్ట్​?

Tata Safari vs Hyundai Alcazar : 2023 టాటా సఫారీ ఎస్​యూవీని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ మోడల్​.. మరింత అట్రాక్టివ్​గా మారింది. ఈ నేపథ్యంలో ఈ టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. హ్యుందాయ్​ అల్కజార్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండింటినీ పోల్చి.. ఏ ఎస్​యూవీ బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

టాటా సఫారీ వర్సెస్​ హ్యుందాయ్​ అల్కజార్​- లుక్స్​..

టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో పారామెట్రిక్​ డిజైన్​తో కూడిన​ భారీ గ్రిల్​, ప్రొడెక్టర్​ బై-ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, ఫుల్​-విడ్త్​ డీఆర్​ఎల్, సీక్వెన్షియల్​ ఇండికేటర్స్​, 19 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​, కనెక్టెడ్​ టైప్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ లభిస్తున్నాయి.

హ్యుందాయ్​ అల్కజార్​లో స్కల్ప్​టెడ్​ బానెట్​, భారీ క్రోమ్​ గ్రిల్​, ట్రై బీమ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్ల్పిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, రూఫ్​ రెయిల్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, స్కిడ్​ ప్లేట్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, 18 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ వీల్స్​ వస్తున్నాయి.

టాటా సఫారీ వర్సెస్​ హ్యుందాయ్​ అల్కజార్​- ఫీచర్స్​..

Tata Safari facelift price Hyderabad : 2023 టాటా సఫారీ స్పేషియల్​ 5/7 సీటర్​ కేబిన్​లో ప్రీమియం 2 టోన్​ డ్యాష్​బోర్డ్​, మల్టీ కలర్డ్​​ మూడ్​ లైటింగ్​, డ్యూయెల్​ టోన్​ 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, 12.3 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​లు వస్తున్నాయి.

హ్యుందాయ్​ అల్కజార్​ 6/7 సీటర్​ ఎస్​యూవీ కేబిన్​లో ప్రీమియం అప్​హోలిస్ట్రీ, పానారోమిక్​ సన్​రూఫ్​, వెంటిలేటెడ్​ సీట్స్​, యాంబియెంట్​ లైటింగ్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ వస్తున్నాయి.

టాటా సఫారీ వర్సెస్​ హ్యుందాయ్​ అల్కజార్​- ఇంజిన్​..

టాటా మోటార్స్​ వెహికిల్​లో 2.0 లీటర్​ క్రియోటెక్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 168 హెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

2023 Tata Safari on road price Hyderabad : ఇక హ్యుందాయ్​ వెహికిల్​ఎస్​యూవీలో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 157 హెచ్​పీ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.5 లీటర్​ డీజిల్​ మోటార్​.. 114 హెచ్​పీ పవర్​ను, 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ధరలు ఇవే..

ఇండియాలో టాటా సఫారీ ఎక్స్​షోరూం ధర రూ. 16.19లక్షలు- రూ. 27.34లక్షల మధ్యలో ఉంటుంది. కాగా హ్యుందాయ్​ అల్కజార్​ ఎక్స్​షోరూం ధర రూ. 16.77లక్షలు- రూ. 21.23లక్షల మధ్యలో ఉంటుంది.

హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం