2023 Skoda Kodiaq launched : సరికొత్త స్కోడా కోడియాక్ లాంచ్.. ధర ఎంతంటే!
05 May 2023, 7:35 IST
- 2023 Skoda Kodiaq launched : 2023 స్కోడా కోడియాక్ లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధర, ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
సరికొత్తగా స్కోడా కోడియాక్ లాంచ్..
2023 Skoda Kodiaq launched : కోడియాక్ ఫ్లాగ్‌షిఫ్ ఎస్‌యూవీని ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో లాంచ్ చేసింది స్కోడా ఆటో ఇండియా. ఈ 7 సీటర్ ఎస్‌యూవీకి చెందిన స్టైల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 37.99లక్షలుగా ఉంది. స్పోర్ట్‌లైన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 39.39లక్షలు, ఎల్ అండ్ కే ఎక్స్‌షోరూం ధర రూ. 41.39లక్షలుగా ఉంది.
2017లో తొలిసారిగా కోడియాక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసింది స్కోడా. కోడియాక్‌ను లిమిటెడ్‌గా సేల్ చేస్తూ వస్తోంది. ఇక 2023 స్కోడా కోడియాక్ ఎస్‌యూవీని సైతం ప్రతి త్రైమాసికంలో కేవలం 750 యూనిట్లనే విక్రయిస్తుంది సంస్థ.
2023 Skoda Kodiaq price : 2023 స్కోడా కోడియాక్ ఇప్పుడు బీఎస్6 స్టేజ్ 2 కంప్లైంట్. ఇందులోని 2.0 లీటర్ టీఎస్ఐ ఈవీఓ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 187 బీహెచ్పీ పవర్‌ను, 320 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. గత మోడల్‌తో పోల్చుకుంటే.. కొత్తగా లాంచ్ యిన స్కోడా కోడియాక్తో మైలేజ్ 4.2శాతం పెరుగుతుందని సంస్థ చెబుతోంది! ఈ మోడల్ 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 7.8 సెకన్లలో అందుకుంటుంది. ఈకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివీడ్జ్యువల్, స్నో వంటి 6 డ్రైవింగ్ మోడ్స్ సైతం లభిస్తున్నాయి.
ఇదీ చదవండి:- Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్‌కు సిద్ధమవుతున్న హ్యుందాయ్ ఎక్స్టర్ ఇదే..!
ఈ కోడియాక్‌లో డోర్- ఎడ్జ్ ప్రొటెక్టర్స్, ఎయిర్‌ఫ్లోను మెరుగుపరిచే విధంగా రేర్ స్పాయిలర్, పాదాల కోసం లాంజ్ స్టెప్, 2వ రేలో ఔటర్ హెడ్‌రెస్ట్స్ వంటివి కొత్తగా వస్తున్నాయి.
2023 Skoda Kodiaq on road price Hyderabad : ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీలో ప్రొగ్రెసివ్ స్టీరింగ్, డైనమిక్ ఛాసిస్ కంట్రోల్, యాంబియెంట్ లైటింగ్, కాంటాన్ 625 డబ్ల్యూ 12 స్పీకర్ ఆడియో సిస్టెమ్, సబ్‌వూఫర్ వంటివి వస్తున్నాయి. రిమోట్‌తో ఓపెన్- క్లోజ్ అయ్యే విండో, డోర్ మిర్రర్స్, పానారోమిక్ సన్‌రూఫ్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి.
"ఇండియాలో మా తొలి ఫుల్- సైజ్ ఎస్యూవీ ఈ కోడియాక్. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా మంచి విజయం సాధించిన మోడల్ ఇది. లగ్జరీ 4X4 సెగ్మెంట్లో దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కస్టమర్లకు అందుబాటులో ఉండేందికి ఎస్యూవీ యూనిట్లను పెంచాము. సేఫ్టీ, లగ్జరీ, వాల్యూ ఫర్ మనీ, ఆఫ్ రోడ్ స్టెబులిటీ పరంగా ఈ కోడియాక్ ది బెస్ట్ అని చెప్పాలి," అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరక్టర్ పీటర్ సాల్క్ అభిప్రాయపడ్డారు.