Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్ ఐ20 వర్సెస్ టాటా ఆల్ట్రోజ్.. ఏది బెస్ట్?
12 September 2023, 10:29 IST
- Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్ ఐ20 వర్సెస్ టాటా ఆల్ట్రోజ్.. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఐ20 వర్సెస్ టటా ఆల్ట్రోజ్.. ఏది బెస్ట్?
Hyundai i20 vs Tata Altroz : హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. మర్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ మోడల్.. టాటా ఆల్ట్రోజ్తో ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
డిజైన్- లుక్స్‌లో ఏది బెటర్?
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో స్కల్ప్టెడ్ బానెట్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్తో కూడిన కొత్త స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్‌తో కూడిన రివైజ్డ్ బంపర్స్, భారీ హెక్సాగొనల్ బ్లాక్ గ్రిల్, జెడ్- షేప్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, 16 ఇంచ్ డిజైనర్ అలాయ్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి.
2023 Hyundai i20 price : టాటా ఆల్ట్రోజ్‌లో మస్క్యులర్ హుడ్, స్లీక్ బ్లాక్ గ్రిల్, స్వెప్ట్ బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బంపర్ మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, వ్రాప్ అరౌండ్ టెయిల్‌ల్యాంప్స్ లభిస్తున్నాయి.
ఈ కార్స్లో ఉన్న ఫీచర్స్ ఇవే..
2023 హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ 5 సీటర్ కేబిన్‌లో సెమీ లెథరెట్ సీట్స్, వాయిస్ కంట్రోల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియెంట లైటింగ్, వయర్లెస్ ఛార్జర్, బాస్ సౌండ్ సిస్టెమ్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ లభిస్తున్నాయి.
ఇక టాటా ఆల్ట్రోజ్‌లో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్, వయర్లెస్ ఛార్జర్, వాయిస్ కంట్రోల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డీజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి లభిస్తున్నాయి.
ఈ రెండు కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.
ఇదీ చూడండి:- 2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్లో ఏది బెస్ట్?
ఈ కార్స్లో ఉన్న ఇంజిన్ ఆప్షన్స్ ఇవే..
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, ఇన్లైన్ 4 పెట్రోల్ మోటార్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్, ఐవీటీ ట్రాన్సిమిషన్ ఆప్షన్న్ ఉన్నాయి. మేన్యువల్ వేరియంట్లో ఈ ఇంజిన్ 87 హెచ్‌పీ పవర్‌ను, 115 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Hyundai i20 facelift price in Hyderabad : టాటా ఆల్ట్రోజ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88 హెచ్‌పీ పవర్‌ను, 115 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.2 లీటర్ సీఎన్జీ ఇంజిన్.. 77 హెచ్‌పీ పవర్‌ను, 103 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ మోటార్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 88.7 హెచ్‌పీ పవర్‌ను, 200 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 108.5 హెచ్‌పీ పవర్‌ను, 140 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, డీసీఏ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి.
ఈ రెండు కార్స్ ధరల వివరాలు ఇలా..
ఇండియాలో 2023 హ్యుందాయ్ ఐ20 ఎక్స్‌షోరూం ధర రూ. 6.99లక్షలు- రూ. 11.1లక్షల మధ్యలో ఉంటుంది. ఇక టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.6లక్షలు- రూ. 10.74లక్షల మధ్యలో ఉంటుంది.