2000 Notes Exchange From Today: నేటి నుంచే బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి: వివరాలివే
23 May 2023, 6:17 IST
- ₹2000 Notes Exchange From Today: బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి నేడు ప్రారంభం కానుంది. ప్రజలు బ్యాంకులకు వెళ్లి తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను ఇచ్చి వేరే నోట్లను పొందవచ్చు.
2000 Notes Exchange From Today: నేటి నుంచే బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి: వివరాలివే (Photo: ANI)
₹2000 Notes Exchange From Today: రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే (Exchange) ప్రక్రియ నేడు (మే 23) మొదలుకానుంది. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లను ఇచ్చి వేరే నోట్లను ప్రజలు పొందవచ్చు. ఇందుకోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని అధికారులు చెప్పారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించుకోవటంతో.. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడమో, లేకపోతే మార్పిడి (Exchange) చేసుకోవడమో చేయాలి. రూ.2,000 నోట్ల డిపాజిట్/మార్పిడికి నేటి(మే 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది ఆర్బీఐ. కాగా, నేడు రూ.2,000 నోట్ల మార్పిడికి తొలి రోజు కావటంతో బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు ఉండే అవకాశాలు ఉన్నాయి.
₹2000 Notes Exchange From Today: రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల్లో ఎలాంటి ఫామ్ రాయాల్సిన అవసరం లేదని, ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అవసరం లేదని ఆర్బీఐ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఓ వ్యక్తి ఓసారి రూ.20,000 విలువైన (10 నోట్లు) రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదని ఎస్‍బీఐ స్పష్టం చేసింది. అయితే, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ఆధార్ లాంటి ఐడీ ప్రూఫ్‍ను ప్రజలు చూపాల్సి ఉంటుందని కొన్ని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కాగా, తమకు ఖాతా లేని బ్యాంకుల్లో కూడా రూ.2,000 నోట్లను ప్రజలు మార్చుకోవచ్చు.
₹2000 Notes Exchange From Today: ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటే క్యూలను నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు.. స్థానిక పోలీసులకు సహకారం కూడా కోరాయి. అలాగే, నకిలీ రూ.2,000 నోట్ల గురించి కూడా బ్యాంకులు హెచ్చరించాయి. నకిలీ నోట్లను ఎవరైనా డిపాజిట్, మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే.. పోలీసు కేసులు పెడతామని చెబుతున్నాయి.
₹2000 Notes Exchange From Today: ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం చెప్పారు. రూ.2,000 నోట్లు చెల్లుబాటులో ఉన్నాయని అన్నారు. నగదు నిర్వహణ చర్యల్లో భాగంగానే రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలో రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే ప్రజలు సాధారణంగా పాన్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.
టాపిక్