తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Trains : విశాఖ‌ నుంచి వెళ్లే ఆరు రైళ్లలో అద‌న‌పు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లు, రేపటి నుంచి అమలులోకి

Visakha Trains : విశాఖ‌ నుంచి వెళ్లే ఆరు రైళ్లలో అద‌న‌పు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లు, రేపటి నుంచి అమలులోకి

HT Telugu Desk HT Telugu

03 July 2024, 22:37 IST

google News
    • Visakha Trains : విశాఖపట్నం నుంచి ప్రయాణించే ఆరు రైళ్లలో అదనపు కోచ్ లో జోడించినట్లు ఈస్ట్ కోస్టు రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విశాఖ‌ నుంచి వెళ్లే ఆరు రైళ్లలో అద‌న‌పు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లు
విశాఖ‌ నుంచి వెళ్లే ఆరు రైళ్లలో అద‌న‌పు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లు

విశాఖ‌ నుంచి వెళ్లే ఆరు రైళ్లలో అద‌న‌పు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లు

Visakha Trains : విశాఖ‌ప‌ట్నం నుంచి ప్రయాణించే ఆరు రైళ్లలో జ‌న‌ర‌ల్ కోచ్‌లు పెంపునకు ఈస్ట్‌కోస్టు రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, జనరల్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, అదనపు జనరల్ క్లాస్ కోచ్‌లతో ముఖ్యమైన సుదూర రైళ్లను రైళ్లకు పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ పెంపు రేపటి (గురువారం) నుంచే అమలులోకి రానుంది.

విశాఖపట్నం-సాయి నగర్ షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18503) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 4 నుంచి ఒక అదనపు జనరల్ క్లాస్ కోచ్‌తో జతచేయ‌నున్నారు. సాయి నగర్ షిరిడీ-విశాఖ‌ప‌ట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18504) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 5 నుంచి ఒక అదనపు జనరల్ కోచ్ పెంచుతున్నారు.

విశాఖపట్నం- జీఎంఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (22869) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 8 నుంచి ఒక అదనపు జనరల్ క్లాస్ కోచ్‌తో జతచేయ‌నున్నారు. జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్-విశాఖపట్నం వీక్లీ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22870) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 9 నుంచి ఒక అదనపు జనరల్ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు. ఈ నాలుగు రైళ్లకి ఒక్కో జ‌న‌ర‌ల్ క్లాచ్ కోచ్ చొప్పున నాలుగు కోచ్‌లు పెంచారు. పెంచిన కోచ్‌ల‌తో క‌లిపి ఆయా రైళ్లలో 2 ఏసీ -1, 3 ఏసీ-5, జ‌న‌ర‌ల్ సెకండ్ క్లాస్-4, సెంక‌డ్ క్లాస్ ల‌గేజీ క‌మ్ దివ్యాంగజ‌న్ కోచ్‌-1, జ‌న‌రేట‌ర్ మోట‌ర్ కార్‌-1 కోచ్‌లు ఉంటాయి.

భువనేశ్వర్-జగ్దల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 4 నుంచి నుంచి ఒక అదనపు జనరల్ క్లాస్ కోచ్‌తో జతచేయ‌నున్నారు. జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలులో అద‌న‌పు కోచ్‌కు అందుబాటులోకి తెచ్చారు. జులై 5 నుంచి ఒక అదనపు జనరల్ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

ఈ రెండు రైళ్లకి ఒక్కొ జ‌న‌ర‌ల్ క్లాచ్ కోచ్ చొప్పున రెండు కోచ్‌లు పెంచారు. పెంచిన కోచ్‌ల‌తో క‌లిపి ఆయా రైళ్లలో 1 ఏసీ-1, 2 ఏసీ -1, 3 ఏసీ-4, స్లీప‌ర్‌-4, జ‌న‌ర‌ల్ సెకండ్ క్లాస్-4, సెంక‌డ్ క్లాస్ ల‌గేజీ క‌మ్ దివ్యాంగజ‌న్ కోచ్‌-1, జ‌న‌రేట‌ర్ మోట‌ర్ కార్‌-1 కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు, ప్రజ‌ల సౌక‌ర్యార్థం ఈ కోచ్‌లు పెంచాల‌ని వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం