Champions Of Change Award: భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్.. షిరిడీకి బంగారు సింహాసనం దానం-mahesh reddy got champions of change award 2024 along with sonu sood manoj bajpayee shilpa shetty arjun rampal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Champions Of Change Award: భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్.. షిరిడీకి బంగారు సింహాసనం దానం

Champions Of Change Award: భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్.. షిరిడీకి బంగారు సింహాసనం దానం

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2024 08:43 AM IST

Champions Of Change Award 2024 Mahesh Reddy: ప్రతిష్టాత్మకంగా భావించే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ను ఏఎం ఆర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏ మహేష్ రెడ్డి అందుకున్నారు. అయితే పాపులర్ నటులు సోనూ సూద్, మనోజ్ బాజ్ పాయ్, శిల్పా శెట్టితోపాటు నిర్మాత మహేష్ రెడ్డికి ఈ అవార్డ్ దక్కింది.

భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్.. షిరిడీకి బంగారు సింహాసనం దానం
భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్.. షిరిడీకి బంగారు సింహాసనం దానం

Champions Of Change Award 2024: ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ఒకటి. గాంధేయ విలువలు, సమాజ సేవ, సామాజిక అభివృద్ధిని పెంపొందించే వ్యక్తులను గుర్తించి వారికి ఈ అవార్డ్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవల మంగళవారం (జనవరి30)న ముంబైలో ఘనంగా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపులర్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఈ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ను అందుకున్నాడు.

సోనూ సూద్‌తోపాటు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్, బ్యూటిఫుల్ శిల్పా శెట్టి, భగవంత్ కేసరి విలన్ అర్జున్ రాంపాల్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అండ్ లేడి డైరెక్టర్ ఫరా ఖాన్‌కు సైతం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ పురస్కారం దక్కింది. వీరితోపాటు పలువురికి వారు చేసిన సేవలకు గాను అవార్డ్ వరించింది. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన, భక్తి చిత్రాల నిర్మాత కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాత, వ్యాపారావేత్త మహేష్ రెడ్డి బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీలతోపాటు ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

మహేష్ రెడ్డి వివరాల్లోకి వెళితే.. భారతదేశంలో సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన చేసిన ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన పనికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుని ఇవ్వడం జరిగింది. ఏఎం ఆర్ గ్రూప్ అధినేత ఏ మహేష్ రెడ్డి తన వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఉన్నత యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈరోజు మైనింగ్ వ్యాపారంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ప్రస్తుతం 5000 మంది పనిచేస్తున్న కంపెనీలో కనీసం లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.

షిరిడి సాయినాధునికి పరమ భక్తుడైన మహేష్ రెడ్డి షిరిడీలోని మందిరానికి బంగారు సింహాసనాన్ని దానం చేశారు. అదేవిధంగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారత దేశంలో పలు చోట్ల దైవ మందిరాలు కట్టించారు. శ్రీశైలం, కాణిపాకం, నెల్లూరులోని రామతీర్థం, శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, శ్రీ పృద్వేశ్వర టెంపుల్ వంటి ఆలయాలను తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. ఆయన గతంలో సాయి ప్రేరణ ట్రస్ట్ సంబంధించి సాయి తత్వాన్ని బోధించే విధంగా చేసిన సేవలకు 'మాలిక్ ఏక్ సుర్ అనేక్' అవార్డుతో ఆయనను సత్కరించారు.

కొవిడ్ పాండమిక్ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాదులో అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్య శ్రీ రామ జన్మభూమికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఏఎం ఆర్ ప్రొడక్షన్స్ ద్వారా భక్తి తత్వాన్ని బోధించే విధంగా రెండు తెలుగు సినిమాలను నిర్మించారు. అదేవిధంగా ఏ మహేష్ రెడ్డి 148 కేజీల బంగారాన్ని సాయిబాబా సనాతన ట్రస్ట్ షిరిడికి విరాళంగా అందజేశారు.

ఇటీవల ఆయన చేసిన సేవకులను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును మంగళవారం (జనవరి 30) రాత్రి ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో ఘనంగా ఏర్పాటు చేసిన అవార్డు ఫంక్షన్‌లో ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇండియా కే.జీ. బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్
భక్తి చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ అవార్డ్
Whats_app_banner