తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో ఎంపిక!

APPSC Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో ఎంపిక!

17 March 2024, 22:11 IST

    • APPSC Group 2 : గ్రూప్-2 పై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ పరీక్షకు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్,
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్,

గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్,

APPSC Group 2 : ఏపీపీఎస్సీ ఇటీవల గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష(APPSC Group 2 Prelims) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో ప్రశ్నాలు కఠినంగా వచ్చాయని అభ్యర్థులు అన్నారు. దీంతో ఏపీపీఎస్సీ(APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 1 : 50(ఒక పోస్టుకు 50 మంది) నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్ణయించింది. తాజాగా 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి పరీక్ష మెయిన్స్(Group 2 Mains) కు ఎంపిక చేయలని బోర్డు నిర్ణయించింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. పేపర్ కఠినంగా రావడంతో 1 : 100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 25న మొత్తం 899 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

5-8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Exam) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఫలితాలను 5 - 8 వారాల్లో ప్రకటిస్తామని తెలిపింది. గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు తెలిపింది.

మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

తెలంగాణ గ్రూప్-1 దరఖాస్తులు

తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువు(TSPSC Group 1 Applications) ముగిసింది. మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగిసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియటంతో ఎడిట్ ఆప్షన్ కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే సవరించే అవకాశం కల్పించనుంది. ఈ ఎడిట్ ఆప్షన్(TS Group 1 Applications Edit Option) మార్చి 23వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.మార్చి 27 సాయంత్రం 5గంటల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ గడువు ముగిసిన తర్వాత… సవరణలకు అవకాశం ఉండని వెల్లడించింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడిట్ ప్రక్రియను చేసుకోవచ్చని తెలిపింది.

తదుపరి వ్యాసం