TSPSC Group 2 3 Updates : తెలంగాణలో పెరగనున్న గ్రూప్ 2, 3 ఖాళీల సంఖ్య..! తాజా అప్‌డేట్ ఇదే
- TSPSC Group 2, 3 Jobs Updates : తెలంగాణ గ్రూప్ 2, 3 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఖాళీల వివరాలను కోరుతూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరిన్ని ఉద్యోగాలు కలవనున్నాయి.
- TSPSC Group 2, 3 Jobs Updates : తెలంగాణ గ్రూప్ 2, 3 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఖాళీల వివరాలను కోరుతూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరిన్ని ఉద్యోగాలు కలవనున్నాయి.
(1 / 6)
ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కీలకమైన గ్రూప్ -1లో పోస్టులను పెంచి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రిలిమ్స్. మెయిన్స్ తేదీలను కూడా ఖరారు చేసింది.(https://www.tspsc.gov.in/)
(2 / 6)
అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలకు సంబంధించి కూడా ఇటీవలే కీలక ప్రకటన చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. (unsplash.com/)
(3 / 6)
రాత పరీక్ష తేదీలను ఖరారు చేసిన క్రమంలో…. గ్రూప్ 2, 3లో మరిన్ని పోస్టులను కలపాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఏఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఇటీవలే ఆదేశాలు పంపింది. త్వరలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల వివరాలపై కూడా ఆరా తీసింది. (unsplash.com/)
(4 / 6)
ఆర్థికశాఖ నుంచి కీలకమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో…. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలోనే మరిన్ని పోస్టులను కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.(unsplash.com/)
(5 / 6)
ప్రస్తుతం గ్రూప్ 2లో ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం 783 ఉద్యోగాలు ఉన్నాయి. ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇక గ్రూప్ 3లో చూస్తే 1,388 ఉద్యోగాలు ఉండగా… నవంబర్ 17, 18 తేదీల్లో ఎగ్దామ్స్ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది. (unsplash.com/)
(6 / 6)
ఇటీవలే గ్రూప్ 1లో పోస్టులను పెంచిన మాదిరిగానే… ఈ రెండు నోటిఫికేషన్లలో కూడా పోస్టులను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి సమాచారం తీసుకున్న ఆర్థికశాఖ… త్వరలోనే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే కొత్త ఖాళీల భర్తీకి మార్గం సులభం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే… కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.(unsplash.com/)
ఇతర గ్యాలరీలు